అంత సీక్రెటా...! పార్టీ నేతలకూ తెలియకుండా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక

అంత సీక్రెటా...! పార్టీ నేతలకూ తెలియకుండా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక
  • లిస్ట్ ఇచ్చి ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురి పేర్లపై టిక్ పెట్టాలని సభ్యులకు సూచన 
  • మీటింగ్ మధ్యలోనే బయటకొచ్చిన రేణుకా చౌదరి, జానారెడ్డి 

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికను కాంగ్రెస్ సీక్రెట్​గా ఉంచుతోంది. ఎన్నికల కమిటీ, స్క్రీనింగ్ కమిటీలోని సభ్యులకు తప్ప.. వేరే ఎవరికీ తెలియకుండా గుట్టుగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నది. ఆదివారం గాంధీభవన్​లో ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సమావేశం నిర్వహించారు. ఇందులో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్​రెడ్డి, జగ్గారెడ్డి తదితర సీనియర్ నేతలు పాల్గొనగా.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సమావేశానికి హాజరు కాలేదు. అయితే సీనియర్ నేతలెవరూ అభ్యర్థుల ఎంపిక సమాచారాన్ని బయటకు చెప్పలేదు. ‘‘టికెట్​కోసం ఎంతోమంది ఆశావహులు అప్లై చేసుకున్నారు. అందుకే డిస్కస్​ చేసిన విషయాలను చెప్పి ఆశావహులను నిరాశపరచకూడదని సీక్రెట్ గా ఉంచుతున్నాం” అని నేతలు పేర్కొన్నారు. పలు నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి సీనియర్ లీడర్లు కాంగ్రెస్ లో చేరుతుండడంతో అభ్యర్థుల ఎంపికను సీక్రెట్ గా ఉంచుతున్నారని సమాచారం. కాగా, పీఈసీ సమావేశం దాదాపు మూడు గంటల పాటు సాగింది. సభ్యులకు ఆశావహుల జాబితాను అందించి.. నియోజకవర్గానికి ముగ్గురి పేర్లపై టిక్ కొట్టాలని సభ్యులకు ఎన్నికల కమిటీ చైర్మన్​ రేవంత్ సూచించారు. అయితే, దీనిపై కొందరు సభ్యులు అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇప్పటికిప్పుడు టిక్ కొట్టాలంటే కష్టమని తేల్చి చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలో రేణుకా చౌదరి మీటింగ్ మధ్యలోనే బయటకు వచ్చేశారు. ‘‘దరఖాస్తు చేసుకున్నోళ్లలో సగం మంది మొహాలు నాకు తెలియవు. అట్లాంటప్పుడు ఎట్లా టిక్ పెడతాను. అసలు అన్ని దరఖాస్తులను ఎట్లా వడబోస్తారు” అని ఆమె ప్రశ్నించారు. మరోవైపు జానారెడ్డి కూడా సమావేశం నడుస్తుండగానే బయటకు వచ్చేశారు. 

బీసీలకు ప్రాధాన్యం.. 

బీసీలకు ప్రాధాన్యం దక్కేలా పార్లమెంట్​కు ఇద్దరు చొప్పున బీసీ నేతలకు సభ్యులు టిక్ పెట్టాలని సమావేశంలో సూచించినట్టు తెలిసింది. హైకమాండ్​ఆదేశాల మేరకు ఒక్కో పార్లమెంట్ ​నియోజకవర్గంలో రెండు స్థానాలను బీసీలకు కేటాయిస్తామని ఇప్పటికే పార్టీ పెద్దలు చెప్పారు. బీసీలకు టికెట్లు ఇవ్వడంతో పాటు గట్టి నేతలకే కేటాయించాలని సమావేశంలో నేతలు తేల్చి చెప్పినట్టు తెలిసింది. బీసీ లీడర్లు స్ట్రాంగ్​గా లేని నియోజకవర్గాల్లో మంచి పట్టున్న నేతలకే టికెట్లు ఇవ్వాలన్న డిమాండ్లు వినిపించాయని సమాచారం. కాగా, వరుసగా మూడ్రోజుల పాటు స్క్రీనింగ్​ కమిటీ సమావేశాలు నిర్వహించనుంది. సోమవారం ఎన్నికల కమిటీ సభ్యులతో విడివిడిగా సమావేశమై, ఒక్కొక్కరి అభిప్రాయాలు తీసుకోనుంది.  

కేసీఆర్​కు దిమ్మతిరిగేలా జాబితా: రేవంత్​

సీఎం కేసీఆర్​కు దిమ్మతిరిగేలా తమ అభ్యర్థుల జాబితా ఉంటుందని రేవంత్ అన్నారు. పీఈసీ మీటింగ్ తర్వాత వెళ్లిపోతూ ఆయన కొన్ని కామెంట్లు చేశారు. అభ్యర్థుల ఎంపికను సీక్రెట్​గానే ఉంచుతామని, అంతా హైకమాండ్​ ద్వారానే సాగుతుందని చెప్పారు. ‘‘ముందే చెప్పినట్టు పార్లమెంట్ స్థానానికి రెండు చొప్పున సీట్లు బీసీలకు ఇస్తాం. అభ్యర్థులు ఎవరన్నది ఇప్పుడు బయటకు చెప్పం. సెప్టెంబర్​లోనే ఎంపిక పూర్తి చేస్తాం” అని తెలిపారు. కాగా, కాంగ్రెస్​లో అన్నీ సాధ్యమేనని జగ్గారెడ్డి అన్నారు. ‘కుటుంబమన్నాక కొట్టుకుంటం.. తిట్టుకుంటం.. ఆ తర్వాత కలిసిపోతాం’  అని ఆయన కామెంట్ చేశారు. 

షర్మిల డిసైడ్ అయితే.. టికెట్ వస్తుందా?: రేణుకా చౌదరి 

ఎక్కడి నుంచి పోటీ చేయాల్నో షర్మిల డిసైడ్ అయితే సరిపోతుందా? అని రేణుకా చౌదరి ప్రశ్నించారు. సోనియా, రాహుల్​తో చర్చలు జరిపినంతమాత్రాన టికెట్ ఫైనల్​ అయినట్టు కాదని అన్నారు. సమావేశం నుంచి బయటకొచ్చాక రేణుక మీడియాతో మాట్లాడారు. పాలేరు టికెట్ అడగడానికి ఆమెకేం అర్హత ఉన్నదని ప్రశ్నించారు. ‘‘షర్మిల తెలంగాణ కోడలైతే.. నేను తెలంగాణ బిడ్డను. టికెట్​ఆశించడంలో తప్పులేదు. కానీ పార్టీకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. ఇన్నాళ్లూ ఏం చేశారని ఇప్పుడు ఆమె పార్టీ విలీనమంటూ మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు పార్టీ విలీనమంటూ కొత్త అంశాన్ని  తెరపైకి తెచ్చారు” అని ఫైర్ అయ్యారు. ఖమ్మంలో కాంగ్రెస్​ను గెలిపించేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారని, ఇప్పుడు షర్మిల మధ్యలో వచ్చి 
డిస్టర్బ్​ చేయొద్దన్నారు. 

లిస్టు మరింత లేటు!

కాంగ్రెస్ అభ్యర్థుల లిస్టు మరింత లేటయ్యే అవకాశం ఉంది. నిజానికి ఆగస్టు చివరి నాటికే లిస్టు ప్రకటిస్తామని తొలుత మాణిక్ రావు ఠాక్రే వెల్లడించారు. ఆ తర్వాత ఈ నెల రెండో వారానికి వాయిదా వేశారు. ఇప్పుడు ఈ నెల రెండో వారంలో కూడా లిస్టు ఇచ్చే పరిస్థితి లేదని తెలుస్తున్నది. కేంద్రం జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కమిటీ వేసిన నేపథ్యంలో లిస్టును మరికొన్ని రోజులు వాయిదా వేయాలని పీసీసీ యోచిస్తున్నట్టు తెలిసింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తర్వాతే లిస్టును ప్రకటించాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. 

ఆశావహుల్లో ఆందోళన.. 

చాలామంది ఆశావహులు టికెట్​వస్తుందా? రాదా? అని ఆందోళన చెందుతున్నారు. ఓ ఆశావహుడికి టికెట్ దక్కాలంటే ఎన్నికల కమిటీలోని సభ్యుల్లో కనీసం 40 శాతం మంది.. ఆ ఆశావహుడిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. అంటే కమిటీలోని 28 మంది సభ్యుల్లో 12 మంది.. ఆ ఆశావహుడి పేరుపై టిక్​చేయాలి. ఈ నేపథ్యంలోనే ఆశావహులు ఆందోళనకు గురవుతున్నారు. దాంతో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గాంధీభవన్ లో ఎన్నికల కమిటీ సభ్యులను కలిసి తమనే ఎంపిక చేయాలని రిక్వెస్ట్​ చేస్తున్నారు.

ఫిర్యాదులు.. టికెట్ గొడవలు 

అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగు తుండగానే ఫిర్యాదులు, టికెట్​ లొల్లులు నడుస్తున్నాయి. మాజీ మంత్రి, పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్​ చిన్నారెడ్డిపై వనపర్తి నేతలు ఎన్నికల కమిటీ సభ్యులకు ఫిర్యాదు చేశారు. చిన్నారెడ్డికి ఎట్టిపరిస్థితు ల్లోనూ టికెట్ ఇవ్వొద్దంటూ డీసీసీ అధ్యక్షు డు వంశీ కంప్లయింట్ ఇచ్చారు. ‘‘చిన్నారెడ్డి వల్లే వనపర్తిలో పార్టీకి తీరని నష్టం జరి గింది. యూత్​ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనా రెడ్డి లేదంటే మేఘారెడ్డికి టికెట్ ఇవ్వాలి” అని ఆయన డిమాండ్ చేసినట్టు తెలి సింది. కాగా, హుస్నాబాద్ టికెట్​ తనకే ఇవ్వాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేస్తు న్నారు. పొత్తుపై చర్చల్లో భాగంగా హుస్నాబా ద్ టికెట్ తమకే ఇవ్వాలంటూ సీపీఐ నేతలు ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో ఈ సీటును తనకే కేటాయించాలని పొన్నం పట్టుబడుతున్నారు.