నేనెప్పుడూ అలా చెప్పలేదు.. 75 ఏళ్లకు రిటైర్మెంట్పై ఆరెస్సెస్ చీఫ్ యూటర్న్!

నేనెప్పుడూ అలా చెప్పలేదు.. 75 ఏళ్లకు రిటైర్మెంట్పై ఆరెస్సెస్ చీఫ్ యూటర్న్!

ప్రధాని మోదీ వయసు 75 ఏళ్లకు చేరుకుంటుండటంతో రిటైర్మెంట్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మోదీ పదవీ విరమణ చేస్తారా.. బాధ్యతలు వేరొకరికి అప్పగిస్తారా అనే చర్చ పార్టీ వర్గాల్లోనూ, ఆరెస్సెస్ లోనూ జరుగుతోంది. గతంలో అధ్వానీ, మురళీ మనోహర్ జోషీ, వెంకయ్యనాయుడు తదితర దిగ్గజాల లాగానే మోదీ కూడా తప్పుకుంటారా..? అనే ప్రశ్న చాలా రోజులుగా ఉత్పన్నమవుతోంది. 

ఒకవైపు దేశవ్యాప్తంగా ఈ చర్చ నడుస్తున్న క్రమంలో.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ యూటర్న్ తీసుకున్నారు. 75 ఏళ్లకు రిటైర్మెంట్ కావాలని తానెప్పుడూ చెప్పలేదని అన్నారు. ఆరెస్సెస్ లో గానీ, బీజేపీలోగానీ 75 ఏళ్లకే పదవీ విరమణ చేయాలని తానెప్పుడూ చెప్పలేదని అన్నారు. సంఘ్ లో మేమంతా వాలంటీర్లం. మాకు నిర్దేశించిన పని చేయాలి. వయసు చెప్పుకుని ఏదైనా పనిని తిరస్కరించేందుకు లేదు.. అని అన్నారు. 

ఆరెస్సెస్ వందేళ్లను పురస్కరించుకుని ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన భగవత్.. 75 ఏళ్లకు తాను రిటైర్ అవుతానని చెప్పలేదని.. అదేవిధంగా ఎవరినీ రిటైర్ కావాలని ఒత్తిడి చేయలేదని చెప్పారు. ఒకవేళ నేను 80 ఏళ్లకు చేరుకుంటే.. వెళ్లి శాఖను నిర్వహించమని ఆరెస్సెస్  ఆదేశిస్తా తప్పకుండా చేస్తానని అన్నారు. 

►ALSO READ | బీహార్ మంత్రిపై దాడి..కిలోమీటర్ వరకు కాన్వాయ్ ని వెంబడించిన స్థానికులు

నరేంద్ర మోదీ, మోహన్ భగవత్ ఈ సెప్టెంబర్ నెలలో 75 ఏళ్లకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఆరెస్సెస్ చీఫ్ గతంలో చేసిన వ్యాఖ్యల ఆధారంగా పార్టీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. అయితే మోదీగానీ, తాను గానీ ఇప్పట్లో రిటైర్ అయ్యే అవకాశం లేదని చెప్పకనే చెప్పారు భగవత్. 

ఆ మధ్య జులై లో ఏ లీడరైనా 75 ఏళ్లకు రిటైర్ అవ్వాల్సిందేనని కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఆరెస్సెస్ సిద్ధాంతకర్తల్లో ఒకరైన మోరోపంత్ పింగ్లీ బుక్ రిలీజ్ సందర్భంగా నాగ్ పూర్ లో మోహన్ భగవత్ ఈ వ్యా్ఖ్యలు చేశారు. 75 ఏళ్లకు చేరుకున్నామంటే ఒక వయసు వచ్చింది.. తప్పుకోవాలని నిర్ణయించుకోవాల్సిందేనని పింగ్లీ వ్యాఖ్యలను ఉదహరిస్తూ అప్పట్లో మోహన్ భగవత్ చేసిన కామెంట్స్.. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.