
తెలంగాణలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా తెలంగాణ మొత్తం జలవిలయంలో చిక్కుకున్నా వరుణుడు కరుణిచడం లేదు. గురువారం (ఆగస్టు 28) మధ్యాహ్నం కాసేపు వర్షం ఆగినట్లు కనిపించినా.. మళ్లీ సాయంత్రం అయ్యేసిరికి వానలు ఊపందుకున్నాయి. ఇప్పటికే నీళ్లల్లో కూరుకుపోయిన గ్రామాలు.. మళ్లీ వాన కురుస్తుండటంతో మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి చేరుకుంటున్నాయి.
అయితే బుధవారంతో పోల్చితే గురువారం కాస్త తక్కువగానే వర్షపాతం నమోదయ్యింది. గురువారం (ఆగస్టు 28) ఉదయం 8.30 నుంచి రాత్రి 9 గంటల వరకు నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ రోజు ఎక్కవ శాతం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వర్షపాతం నమోదైంది. కామారెడ్డి లోని రామారెడ్డి లో 17.13 సెంటీమీటర్ల అత్యధిక భారీ వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత నిజామాబాద్లో వరుసగాకల్దుర్కి లో 16.38, తుంపల్లి లో 16.33, సిరికొండ లో 13.43, చిమన్ పల్లిలో 13.2, ధర్పల్లి లో 12.48, మదన్ పల్లె లో 12.43 , భీమ్ గల్ లో 11.8 సెంటీమీటర్ల అత్యధిక భారీ వర్షపాతం నమోదయ్యింది.
►ALSO READ | మానవత్వం చాటుకున్న యువకులు..జేసీబీతో గర్భిణీని వాగు దాటింపు
ఇక నిర్మల్ జిల్లాలోని పెంబి లో 11.53 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదయ్యింది. ఆ తర్వాత కామారెడ్డి లోని బోమన్ దేవిపల్లి లో 11.45, నిజామాబాద్ లోని కొరట్పల్లి లో 11.1 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదయినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. మరో 19 ప్రాంతాల్లో 8 నుంచి 11 సెంటీమీటర్ల లోపు భారీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.