
జగిత్యాల జిల్లాలో యువకులు మానవత్యం చాటుకున్నారు. పురిటి నొప్పులతో వాగు దాటలేక అవస్థలు పడుతున్న నిండు గర్భిణీని సకాలంలో వాగు దాటించి ప్రాణాలు కాపాడారు. యువకుల సమయస్పూర్తికి గ్రామస్తులు ప్రశంసలు కురిపించారు. వివరాల్లోకి వెళితే..
జగిత్యాల జిల్లా వడ్డె లింగాపూర్ కు చెందిన గర్భిణీ పురిటి నొప్పులు వాగు దాటలేక అవస్థలు పడుతుండగా స్పందించిన స్థానిక యువత ఆమెకు అండగా నిలిచారు.
గురువారం(ఆగస్టు28) గతరాత్రి కురిసిన వర్షాలకు రాయికల్ మండలం రామాజీజేట, భూపతిపూర్ గ్రామాల మధ్య వాగు ఉధృతంగా రోడ్డుపై నుంచి ప్రవహించింది.దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఒడ్డెలింగాపూర్కు చెందిన కళ్యాణి అనే గర్భిణీ రాయికల్ ఆస్పత్రికి వెళ్లేందుకు రాగా..రామాజీపేట శివారులో బ్రిడ్జి పై నుంచి వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో వాగు దాటేందుకు అవకాశం లేకుండా పోయింది.. కళ్యాణి పురిటినొప్పులు పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు.
►ALSO READ | గొండ్రియాల పాలేరు వాగులో యువకుడు గల్లంతు
స్పందించిన స్థానికులు యువకులు జేసీబీలో తెప్పించి గర్భిణీతోపాటు ఆమె కుటుంబ సభ్యులను అందులో కూర్చోబెట్టి వాగు దాటించారు.తర్వాత అంబులెన్స్ తో రాయికల్ ఆస్పత్రికి తరలించారు. సకాలంలో స్పందించిన యువకులను పలువురు అభినందించారు.