గొండ్రియాల పాలేరు వాగులో యువకుడు గల్లంతు

గొండ్రియాల పాలేరు వాగులో యువకుడు గల్లంతు

యువకులకు మధ్య పందెం..ప్రాణం మీదకు తెచ్చింది..ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటే ప్రయత్నంలో ఓ యువకుడు వాగులో కొట్టుకుపోయాడు. వాగు దాటుతుండగా.. ఒక్కసారిగా  వరద ప్రవాహం పెరగడంతో యువకుడు నీటిలో కొట్టుకుపోయిన సంఘటన  సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం గొండ్రియాలలో జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. 

గురువారం (ఆగస్టు 28) గొండ్రియాలకు చెందిన ముగ్గురు యువకులు ఉధృతంగా  ప్రవహిస్తున్న వాగు దాటే విషయం పందెం వేసుకున్నారు. వారిలో దివ్యాంగుడైన ఉపేందర్ (23) వాగు దాటుతానని  మిగతా యువకులతో పందెం వేసి వాగు దాటే ప్రయత్నం చేశాడు. వాగు దాటుతుండగా.. ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగి నీటిలో కొట్టుకుపోయాడు.  

 విషయం తెలుసుకున్న  రెస్క్యూ టీం సంఘటనా  స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

►ALSO READ | యుద్ధ ప్రాతిపదికన నష్టాన్ని అంచనా వేయండి.. వర్షాలపై సమీక్ష సందర్భంగా సీఎం రేవంత్