శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ల కలకలం.. ప్యాసెంజర్ లగేజీలో 8 రౌండ్ల లైవ్ బుల్లెట్లు స్వాధీనం..

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ల కలకలం.. ప్యాసెంజర్ లగేజీలో 8 రౌండ్ల లైవ్ బుల్లెట్లు స్వాధీనం..

శంషాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టులో బుల్లెట్లు లభ్యం కావడం కలకలం రేపింది. గురువారం (ఆగస్టు 28) ఒక ప్రయాణీకుడి లగేజీ బ్యాగ్ నుంచి లైవ్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు భద్రతా సిబ్బంది. ప్యాసెంజర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

పంజాబ్ భవానీఘర్ కు చెందిన సుఖ్ దీప్ సింగ్ (32) అనే వ్యక్తి నుంచి బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ మీదుగా అమృత్ సర్ వెళ్లాల్సి ఉంది. ఇండిగో ఎయిర్ లైన్స్  6E-6076, 6E-5007 ఫ్లైట్లలో వెళ్లాల్సిన వ్యక్తి బుల్లెట్లతో దొరకడంపై దర్యాప్తు చేస్తున్నారు. 

బుల్లెట్ల వివరాలు:

0.2 mm – 4 రౌండ్లు, 0.7 mm – 2  రౌండ్లు, 7.52 mm – 1 రౌండ్, 7.62 mm – 1 రౌండ్ బుల్లెట్లు ప్యాసెంజర్ బ్యాగులో దొరికాయి. అయితే ఆయుధాలకు సంబంధించి ఎలాంటి లైసెన్స్ చూపించలేకపోయాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

►ALSO READ | హైదరాబాద్లో మూసీలో వ్యక్తి గల్లంతు.. ఛాదర్ఘాట్ దగ్గర మూసీలో పడటంతో ప్రమాదం