MiraiTrailer: ‘మిరాయ్’ ట్రైలర్‌‌‌‌ రిలీజ్.. విధ్వంసం సృష్టించిన తేజ, మంచు మనోజ్

MiraiTrailer: ‘మిరాయ్’ ట్రైలర్‌‌‌‌ రిలీజ్.. విధ్వంసం సృష్టించిన తేజ, మంచు మనోజ్

తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘మిరాయ్’. ఇందులో తేజ సూపర్ యోధ అవతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, మంచు మనోజ్ సైంటిఫికల్ విలన్ రోల్లో కనిపించబోతున్నారు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌పై టీజీ విశ్వ ప్రసాద్ గ్రాండ్గా నిర్మించారు. సెప్టెంబర్ 12న 2డి, 3డి ఫార్మాట్స్‌‌లో ఎనిమిది భాషల్లో సినిమా విడుదల కానుంది. 

ఈ సందర్భంగా ఇవాళ (ఆగస్ట్ 28న) మిరాయ్ ట్రైలర్‌‌‌‌ రిలీజ్ చేశారు మేకర్స్. 2 నిమిషాల 58 సెకన్ల నిడివి గల మిరాయ్ ట్రైలర్, అదిరిపోయే సినిమాటిక్ విజువల్స్తో భారీ స్థాయిలో ఉంది. తేజ సజ్జా, మంచు మనోజ్ ఒకరినొకరు ఢీ అంటే ఢీ అనేలా విధ్వంసం సృష్టించారు. తేజ చేతిలో ఓ స్పెషల్ పవర్‌‌‌‌తో కూడిన స్టిక్ ఉంటే, మనోజ్ చేతిలో పదునైన ఖడ్గం క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఇవే సినిమా నేపథ్యాన్ని కూడా వివరించేలా ఉన్నాయి.

ఈ ప్రమాదం ప్రతి గ్రంథాన్ని చేరబోతోంది అనే డైలాగ్తో  ట్రైలర్ మొదలైంది. ‘నా గతం నక్షత్రం.. నా ప్రస్తుతం ఊహ అతీతం’ అంటూ మనోజ్ ఎంట్రీ ఇంటెన్స్ పెంచుతుంది. '9 గ్రంథాలు వాడికి దొరికితే.. పవిత్ర గంగలో పారేది రక్తం అని జగపతి బాబు చెప్పే డైలాగ్ ఆసక్తి కలిగిస్తుంది.

ట్రైలర్ చివర్లో ‘నేను చేయగలనని నన్ను చూడని లోకం నమ్మింది.. నాతో లేని నా తల్లి నమ్మింది.. ఇక నేను నమ్మటమే మిగిలింది..’ 'ఆహం రణసిద్దం.. జైత్రయ.. ఇదే చరిత్ర, ఇదే భవిష్యత్తు, ఇదే మిరాయ్' అని హీరో తేజ చెప్పే డైలాగ్ ఆలోచింపజేస్తుంది. 

ట్రైలర్లో ముఖ్యంగా VFX మరియు కెమెరావర్క్ ప్రత్యేకంగా నిలిచాయి. ఇది థియేటర్లో ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించేలా విజువల్స్ అదిరిపోయాయి. లాస్ట్ బట్ నాట్ లిస్ట్ 'గౌర హరి' అందించిన మ్యూజిక్ ఆడియన్స్లో గూసుబంప్స్ తెప్పించడం కన్ఫార్మ్ అనేలా ఉంది. ఇప్పటికే ‘మిరాయ్’ టీజర్‌‌‌‌ రిలీజై భారీ హైప్ పెంచింది. ఈ క్రమంలో లేటెస్ట్ ట్రైలర్ ఎలాంటి భీభత్సం సృష్టించనుందో ఆసక్తి నెలకొంది. 

రితికా నాయక్‌‌ హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో  శ్రియా శరణ్, జగపతిబాబు, జయరామ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. హనుమాన్ ఫేమ్ గౌర హరి సంగీతం అందిస్తున్నాడు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కరణ్ జోహర్ హిందీలో రిలీజ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. మిరాయ్ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని.. డైరెక్టర్ మాత్రమే కాకుండా సినిమాటోగ్రఫీ కూడా అందించడంతో మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలా చేశాడు. కార్తీక్ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలకు సినిమాటోగ్రఫీగా వర్క్ చేశాడు. అందులో ‘సూర్య వర్సెస్ సూర్య , ప్రేమమ్, చిత్రలహరి, కృష్ణార్జున యుద్ధం, నిన్ను కోరి, ఎక్స్‌ప్రెస్ రాజా, కార్తీకేయ’ వంటి సినిమాలు ఉన్నాయి.