భారీ వర్షం: నల్గొండలో స్తంభించిన ట్రాఫిక్..4 కి.మీ జామ్.. స్కూళ్లకు సెలవు..

 భారీ వర్షం: నల్గొండలో స్తంభించిన ట్రాఫిక్..4 కి.మీ జామ్.. స్కూళ్లకు సెలవు..

నిన్నటి నుండి గ్యాప్ ఇవ్వకుండా కురుస్తున్న వర్షాలకు  తెలంగాణలోని పలు జిల్లాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి, రవాణా వ్యవస్థ ఎక్కడిక్కక్కడే నిలిచిపోయింది. ఇవాళ ఉదయం  నల్గొండ జిల్లాలో భారీ వర్షాల కారణంగా నాగిరెడ్డిపల్లి వద్ద భువనగిరి-నల్గొండ రహదారి జలమయమైంది, దింతో గురువారం ఉదయం నుండి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే రెండు వైపులా నాలుగు కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

 చివరికి అధికారులు నాగరం ఇంకా చౌటుప్పల్ మీదుగా వాహనాలను మళ్లించాల్సి వచ్చింది. మరోవైపు వాతావరణం కారణంగా నల్గొండ, యాదాద్రి-భువనగిరిలో స్కూళ్లకు కూడా జిల్లా యంత్రాంగం సెలవు ప్రకటించింది. అయితే  రాబోయే ఆరు గంటల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ పరిశోధకులు తెలిపారు.