
హైడ్రా కూల్చివేతలపై ఒకవైపు విమర్శలు మరోవైపు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రామ్ నగర్ లో కూల్చివేతలపై హైడ్రా ను హైకోర్టు అభినందించింది. ప్రజా ఆస్తుల రక్షణలో హైడ్రా అవసరం ఎంతైనా ఉందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. హైదరాబాద్ ను పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దడంలో హైడ్రా కృషి ఎంతో ఉందని గురువారం (ఆగస్టు 28) హైకోర్టు పేర్కొంది.
రాంనగర్ కూల్చివేతలపై హైకోర్టు అభినందించినట్లు హైడ్రా ప్రకటన విడుదల చేసింది. రహదారులు, పార్కులు, ప్రజా స్థలాలను కాపాడేందుకు హైడ్రా వంటి సంస్థలు కీలకం అని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
రామ్ నగర్ లో రోడ్డు ను ఆక్రమించి నిర్మించిన కమర్షియల్ బిల్డింగ్ ను గతంలో హైడ్రా కూల్చేసింది. హైడ్రా కూల్చివేతల పై హైకోర్టును ఆశ్రయించాడు ఓ వ్యక్తి. ఇవాళ (గురువారం ఆగస్టు 28) హైకోర్టులో విచారణ సందర్భంగా.. అక్రమంగా నిర్మించిన బిల్డింగ్ కూల్చివేత సబబేనని హైకోర్టు తెలిపింది. రాకపోకలకు ఆటంకం కలిగించే నిర్మాణాల తొలగింపులో హైడ్రా పాత్రపై హైకోర్టు ప్రశంసించింది. ప్రజా ఆస్తులు, నీటి వనరుల సంరక్షణలో హైడ్రా చర్యలు ప్రశంసనీయమని హైకోర్టు వ్యాఖ్యానించినట్లు హైడ్రా ప్రకటన విడుదల చేసింది.
►ALSO READ | శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ల కలకలం.. ప్యాసెంజర్ లగేజీలో 8 రౌండ్ల లైవ్ బుల్లెట్లు స్వాధీనం..