వైరల్​ వీడియో: నడి రోడ్డుపై యువతి డ్యాన్స్​.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్

వైరల్​ వీడియో:  నడి రోడ్డుపై యువతి డ్యాన్స్​.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్

యువత ఏదో రకంగా సోషల్‌  మీడియా(Social media)లో వైరల్ కావాలని, రాత్రికి రాత్రే స్టార్లు కావాలని కుతూహలంతో రోడ్లు, బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్‌లు, నడిరోడ్డు వంటి పబ్లిక్ ప్లేసుల్లో డ్యాన్సులు(Dance) చేస్తూ.. ప్రాంక్ వీడియోలు చేస్తూ.. పబ్లిక్ ప్లేసులో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అలాంటి ఓ వీడియోను తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ హ్యాండిల్ షేర్ చేస్తూ.. విచారం వ్యక్తం చేశారు. ఇంతకీ ఆ వీడియో ఎంటీ? ఆయన అంతగా రియాక్ట్ కావడానికి కారణమేంటి? మీరు కూడా ఓ లూక్కేయండి. 

ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రెడ్ లైట్లు పడ్డాయి. వాహనాలు ఆగిపోతున్నాయి.. అదే సమయంలో బ్యాగ్ వేసుకుని రోడ్డు మధ్యలోకి వచ్చింది ఓ యువతి విచిత్రంగా ప్రవర్తించింది. బ్యాగ్ ను పక్కకు విసిరేసి రోడ్డుపై పడుకుని డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది.. యువతి విచిత్రమైన ప్రవర్తనతో వాహనదారులు ఖంగుతిన్నారు. యువతి డ్యాన్స్ చేస్తున్న సమయంలో పక్కనే ఉన్న ఆమె స్నేహితులు వీడియో తీశారు. అయితే, ఆ యువతి యూట్యూబ్ షార్ట్స్ కోసం ఇలా నడిరోడ్డుపై డ్యాన్స్ చేసినట్లు తెలుసుకున్న వాహనదారులు ఆమెపై మండిపడ్డారు

 రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్ అయ్యేందుకు ఓ యువతి చేసిన రచ్చపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మండిపడ్డారు. నడిరోడ్డుపై ఈ వెర్రి చేష్టలు ఏంటంటూ ఫైర్ అయ్యారు. కాగా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వల్ల యువత సోషల్ మీడియాకు బాగా అడిక్ట్ అయ్యింది. లైక్స్, వ్యూస్ మోజులో ఏం చేస్తున్నారో కూడా ఆలోచించడం లేదు. కొత్తగా ట్రై చేసి ఫాలోవర్స్ పెంచుకోవడం అత్యుత్సాహం ప్రదర్శించి వార్తల్లోకి ఎక్కుతున్నారు. రకరకాల విన్యాసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజా ఫాలోవర్స్, వ్యూస్ కోసం ఓ యువతి చేసిన రచ్చ ఏకంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కే అసహనం తెప్పింది. స్కూల్ డ్రెస్‌లో ఉన్న ఓ యువతి నడిరోడ్డు మీదకు వచ్చి డ్యాన్స్‌ చేసిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

ఈ వీడియోలో..బ్యాగ్ ధరించిన యువతి వాహనాలు వెళ్తున్న రోడ్డు మధ్యలోకి నడుచుకుంటూ వెళ్లింది. తన కాలేజీ బ్యాగ్‌ను రోడ్డుపై పడేసి రోడ్డుపై పడుకుని స్టెప్పులు వేసింది. రోడ్డుపై ట్రాఫిక్ సిగ్నల్‌ పడి ఆటోలు, బస్సులు ఆగడంతో కెమెరా వైపు చూస్తూ యువతి డ్యాన్స్ చేస్తుంటుంది. మొత్తం 23 సెకెన్ల పాటు ఉన్న ఈ రీల్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా అయ్యింది. ఆ యువతి తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోను సజ్జనార్ ఎక్స్ లో పోస్టు చేశారు.