
- గత ఏప్రిల్ 14కు ముందున్న సర్టిఫికెట్లు చెల్లవన్న బోర్డు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్పీఆర్బీ) ఇటీవల జారీ చేసిన 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (ఏపీపీ) ఖాళీల భర్తీకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పోస్టులకు సంబంధించి ఎస్సీ విభాగానికి చెందిన అభ్యర్థులు 2025 ఏప్రిల్ 14న జారీ చేసిన ఎస్సీ కేటగిరీ యాక్ట్ నంబర్ 15 ఆధారంగా ఎస్సీ సబ్ -క్లాసిఫికేషన్‌తో కూడిన కమ్యూనిటీ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
2025 ఏప్రిల్ 14కు ముందు జారీ చేసిన ఎస్సీ సబ్ -క్లాసిఫికేషన్ లేని కమ్యూనిటీ సర్టిఫికెట్లు ఎస్సీ కేటగిరీ కింద రిజర్వేషన్ కోసం పరిగణించరు. ఈ మేరకు టీఎస్‌ఎల్పీఆర్బీచైర్మన్ వీవీ శ్రీనివాస్ రావు శుక్రవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు.