మూడో ఘాట్‌రోడ్‌ నిర్మాణానికి TTD పాలకమండలి ఆమోదం

మూడో ఘాట్‌రోడ్‌ నిర్మాణానికి TTD పాలకమండలి ఆమోదం

కొత్త ఏడాదిలో భక్తుల సౌకర్యం కోసం  దర్శన టికెట్ల సంఖ్యను పెంచాలని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)నిర్ణయించింది. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత దర్శన టికెట్లను పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఆర్జిత సేవలకు కూడా భక్తులను అనుమతించాలని  తీర్మానం చేసింది. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై చర్చించేందుకు సమావేశమైన TTD పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 

గత ఏడాది మాదిరిగానే 10 రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించాలని తీర్మానించినట్లు చెప్పారు TTD ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి. అన్నమయ్య మార్గంలో మూడో ఘాట్‌రోడ్‌, నడక మార్గం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో నివేదిక తయారు చేసి రోడ్డు, కాలినడక మార్గాలను నిర్మిస్తామన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు కారణంగా దెబ్బతిన్న ఆలయాలను పునరుద్ధరణ చేసేందుకు పాలకమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.  శ్రీశైలంలో ఆలయ గోపురానికి బంగారు తాపడం చేయిస్తామని చెప్పారు.