శ్రీవాణి ట్రస్ట్ పై తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు.. నిబంధనల ప్రకారమే కాంట్రాక్ట్ లు

శ్రీవాణి ట్రస్ట్ పై తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు.. నిబంధనల ప్రకారమే కాంట్రాక్ట్ లు

శ్రీవాణి ట్రస్ట్ వ్యవహారాలపై మరోసారి టీటీడీ ఈవో ధర్మారెడ్డి వివరణ ఇచ్చారు. ట్రస్ట్ పై కొందరు చేసే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన భక్తులకు విజ్ఞప్తి చేశారు.ఆదివారం( జులై 16)  తిరుమలలోని అన్నమయ్య భవన్ లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో 23 మంది భక్తుల సలహాలు, సూచనలకు, ప్రశ్నలకు టీటీడీ ఈవో  సమాధానం చెప్పారు.   శ్రీవాణి ట్రస్టు ద్వారా ఇప్పటికే 9 లక్షల మంది దర్శనం చేసుకున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు శ్రీవాణి ట్రస్ట్ కు 880 కోట్లు విరాళాలు అందాయన్నారు.  కావాల్సిన వారికే ఆలయాల నిర్మాణ కాంట్రాక్ట్ పనులు ఇస్తున్నట్టు తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు.  ట్రస్ట్ పై మరో రకమైన ఆరోపణలు కూడా తమ దృష్టికి వచ్చాయన్నారు ధర్మారెడ్డి. నిబంధనల ప్రకారమే నిర్మాణాల కాంట్రాక్ట్ లు ఇస్తున్నామని వివరించారు. తప్పుడు ప్రచారాలు చేపే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు, 

2500 ఆలయాలు నిర్మాణం

 ఇప్పటి వరకు 2 వేల 500 ఆలయాలను నిర్మాణం చేపట్టామన్నారు.. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా విరాళాలు అందించిన భక్తులు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు.  ఇప్పటివరకు ఒక ఫిర్యాదు కూడా చేయలేదని ఆయన వివరించారు.. అయితే శ్రీవాణి ట్రస్ట్ ఆలయ నిర్మాణాలు  నాలుగు విధానాల్లో నిర్వహిస్తున్నామన్నారు. అందులో మొదటిది దేవదాయ శాఖ, రెండవది టీటీడీ, మూడవది ఆలయ కమిటీలు, నాలుగవది స్థానిక స్వచ్ఛంద సంస్థల ద్వారా మాత్రమే ఆలయ నిర్మిస్తున్నామన్నారు. . ఇక పార్వేటి మండలం శిథిలావస్థకు చేరుకోవడంతోనే జీర్ణోద్ధరణ పనులు చేస్తున్నామని ఆయన చెప్పారు. పార్వేట మండపాన్ని కూల్చేస్తున్నామనేవి కూడా తప్పుడు ఆరోపణలేనని, జీర్ణోద్ధరణలో భాగంగానే పార్వేట మండపం నిర్మాణం జరుగుతోందన్నారు ధర్మారెడ్డి.  

ప్లాస్టిక్ రహిత తిరుమలగా ...

జూన్ నెల ఆదాయం రూ.116.14 కోట్లు.. తిరుమల శ్రీవారిని జూన్ నెలలో 23 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని తెలిపారు టీటీడీ అధికారులు. హుండీ ద్వారా రూ. 116.14 కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రకటించారు. జూన్ నెలలో 1.6 కోట్ల లడ్డులను భక్తులకు విక్రయించింది టీటీడీ. తిరుమల కొండపైనే కాకుండా.. ఘాట్ రోడ్డు, నడక మార్గాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుతామంటున్నారు అధికారులు. ప్లాస్టిక్ రహిత తిరుమలను సాకారం చేస్తామంటున్నారు. ఘాట్‌ రోడ్డులో ప్లాస్టిక్‌ వ్యర్థాలతో వన్యప్రాణులకు హాని కలుగుతోందని చెప్పారు. అందుకే వ్యర్థాలు వేసేందుకు ఆర్టీసీ బస్సుల్లో చెత్త కుండీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాలినడక మార్గంలో చిరుత దాడిలో గాయపడిన కౌశిక్‌ కోలుకున్నాడని చెప్పారు. రాత్రి వేళ గాలిగోపురం నుంచి వచ్చే భక్తులు గోవింద నామస్మరణతో గుంపుగా రావాలని సూచించారు.

భక్తుల మధ్య తోపులాట జరుగుతోంది

డయల్ యువర్ కార్యక్రమంలో శ్రీవారి ఆలయంలో భక్తుల మధ్య తోపులాట జరుగుతోందని  కొందరు తెలిపారని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.  అయితే శ్రీవారి ఆలయంలో భక్తుల మధ్య తోపులాట లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తామని, మహా ద్వారం నుండి బంగారు వాకిలి వరకు సింగల్ లైన్ లో భక్తులను అనుమతిస్తున్నామన్నారు.. ఇక వికలాంగులకు, సీనియర్ సిటిజెన్స్ లకు ప్రత్యేక దర్శన సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. .. లగేజ్ కలెక్షన్స్, డెలివరీ సిస్టంలో నూతన విధానాన్ని ప్రవేశపెడతామని ఆయన చెప్పారు.. శ్రీవాణి ట్రస్ట్ దర్శనాల విషయంలో పారదర్శకంగానే టోకెన్ల కేటాయింపు చేస్తున్నామని చెప్పారు ఈవో ధర్మారెడ్డి.  ఇక ఇక ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి  15వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను ఆన్ లైన్ లో  విడుదల చేస్తామన్నారు.. శ్రీవారి ఆలయంలో పంచ బేరాలను పరిరక్షించడమే మొదటి ప్రాధాన్యత అని ఆగమ పండితులు సలహాలు ఇచ్చారని, పంచ బేరాల్లో ఏదైనా విగ్రహాలు ఛిద్రమైతే తిరిగి వాటిని కరిగించి విగ్రహాలుగా రూపొందించాలని  సూచించారని చెప్పారు.. అందులో భాగంగానే ఉత్సవ విగ్రహాలను పరిరక్షించాలని అర్చకులు, జీయ్యంగార్లు, ఆగమ పండితులు సూచించడంతో నిత్యం నిర్వహించే అభిషేక సేవను రద్దు చేశామన్నారు..