సీపీఎస్ రద్దుకు వర్సిటీ బోధకుల వినతి

సీపీఎస్ రద్దుకు  వర్సిటీ బోధకుల వినతి

నిజామాబాద్​, వెలుగు:  తెలంగాణ వర్సిటీ బోధకులు అసోసియేషన్ (టూటా) ప్రెసిడెంట్ డాక్టర్ పున్నయ్య సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని వీసీ యాదగిరిరావుకు వినతి పత్రం సమర్పించారు.  రాష్ట్రాలకు పెన్షన్ విధానంపై నిర్ణయం తీసుకునే అధికారం ఉన్నప్పటికీ నిర్లక్ష్యం జరుగుతోందన్నారు. 

కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్ రద్దు చేర్చినప్పటికీ అమలు కాకపోవడం శోచనీయమని విమర్శించారు.  వర్సిటీలోని నాన్-టీచింగ్ స్టాఫ్ సీపీఎస్ రద్దు కోసం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.  వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సత్యనారాయణరెడ్డి, ట్రెజరర్ డాక్టర్ నాగరాజు, రాంబాబు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ విజయలక్ష్మి, సూపరింటెండెంట్ ఉమారాణి ఉన్నారు.