తెలంగాణలో ఫస్ట్ కరోనా కేసుకు రెండేళ్లు

తెలంగాణలో ఫస్ట్ కరోనా కేసుకు రెండేళ్లు

ఆతెలంగాణ రాష్ట్రంలో కరోనా మొదటి కేసు నమోదు అయి రెండేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా గాంధీ అసుపత్రిలో పని చేసిన సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు..  కరోనాతో చనిపోయిన వారికి నివాళులు అర్పించారు. ఆస్పత్రిలో స్మారక సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అదేశలతో ముందస్తు చర్యలు ఎన్నో తీసుకున్నామన్నారు ఆస్పత్రి డీఎమ్ఈ రమేష్ రెడ్డి. కరోనాకు సరైన ట్రీట్మెంట్ అంటు ఏదీ లేకపోయినా... గైడ్ లైన్స్ కూడా పెద్దగా లేని సమయంలో కూడా ఎంతోమంది కరోనా పేషంట్లకు గాంధీ అసుపత్రి ట్రీట్మెంట్ అందించామని తెలిపారు.

గాంధీ ఆసుపత్రిని కోవిడ్ నోడల్  సెంటర్  చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారన్నారు. ఒకేసారి 600 మందికి వెంటిలేటర్ పైన సేవలు అందించిన ఆస్పత్రి కేవలం గాంధీ ఆసుపత్రి మాత్రమే అన్నారు. ఇది ఓ రికార్డ్ అన్నారు. దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి ఫెసిలిటీ లేదన్నారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు సైతం పేషంట్ బతకడని అంబులెన్స్‌లో వేసి పంపిస్తే అలాంటి వారికి కూడా తాము చికిత్స చేసి సేఫ్ గా ఇంటికి పంపామన్నారు. కరోనా సమయంలో ఆక్సిజన్ కొరత లేకుండా ప్రభుత్వం పక్క ప్రణాళికలతో ముందుకు వెళ్ళిందన్నారు. 

మీడియా కూడా కరోనా సమయంలో పాజిటివ్ గా పనిచేసిందన్నారు. కోవిడ్ వచ్చి గాంధీ అసుపత్రిలో కొంత మంది సిబ్బంది ,వారి కుటుంబ సభ్యులు కూడా చనిపోయారన్నారు. కోవిడ్ వెళ్ళిపోయింది అని అపోహ వద్దన్నారు. కోవిడ్ తగ్గుమొఖం మాత్రమే పట్టిందన్నారు. మరో కరోనా వేవ్ రాకూడదని కోరుకుందామన్నారు గాంధీ ఆస్పత్రి డీఎమ్ఈ రమేష్ రెడ్డి. 

ఇవి కూడా చదవండి:

దేశంలో 7,554 కొత్త కరోనా కేసులు

బీహార్ అధికారులే రాష్ట్రాన్ని శాసిస్తున్రు