అబుదాబిలో మోడీకి ఘనస్వాగతం

అబుదాబిలో మోడీకి ఘనస్వాగతం

జర్మనీ పర్యటన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ  అబుదాబికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘనస్వాగతం లభించింది. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చి మోడీకి స్వాగతం పలికారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. దీనిపై స్పందించిన మోడీ  "నా సోదరుడు, రారాజు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి స్వాగతించడం నన్ను కదిలించివేసింది. ఆయనకు నా కృతజ్ఞతలు" అంటూ ట్వీట్ చేశారు.  

యూఏఈ పర్యటనలో భాగంగా మోడీ మే నెలలో దివంగతులైన యూఏఈ మాజీ పాలకుడు షేక్ ఖలీఫా బిన్ జాయేద్ అల్ నహ్యాన్ కు నివాళులర్పించారు. షేక్ ఖలీఫా అల్ నహ్యాన్ 2004 నవంబర్ నుండి యూఏఈ అధ్యక్షుడిగా కొనసాగారు. ఆయన మరణం తర్వాత షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అబుదాబీ నేతలతో కాసేపు ముచ్చటించిన అనంతరం ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీకి బయలు దేరారు.