
'అడిక్షన్' అనే జర్నల్‌లో వచ్చిన ఒక కొత్త పరిశోధన ఒక భయంకరమైన వాస్తవాన్ని వెల్లడించింది. ఇప్పుడు వయసు పైబడిన అమెరికన్లు మద్యం, పొగాకు కన్నా అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ (UPFలు) అంటే ప్యాకెట్ ఫుడ్స్‌కు ఎక్కువగా బానిసలవుతున్నారట. వీటిలో పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్లు), కొవ్వు పదార్ధాలు, కృత్రిమ రుచులు ఉంటాయి. ఇవి మెదడులోని సంతోషాన్ని ఇచ్చే భాగాన్ని ఎక్కువగా ఉత్తేజపరిచేలా తయారవుతాయి, కానీ పోషకాలు మాత్రం తక్కువగా ఉంటాయి.
మిచిగాన్ & ఉతా యూనివర్సిటీలు 50 నుండి 80 సంవత్సరాల వయస్సు ఉన్న 2వేల మందికి పైగా పెద్దలపై ఈ సర్వే చేశాయి. వీరిలో దాదాపు 12% మంది ప్రాసెస్ చేసిన ఫుడ్ కి బానిసలయ్యే లక్షణాలు బయటపడ్డాయి. ఈ విషయం అదే వయసులో ఉన్న వారిలో మద్యం (1.5%) లేదా పొగాకు (4%) వ్యసనం కన్నా చాలా ఎక్కువ.
మహిళలకు గట్టి దెబ్బ: ఈ పరిశోధనలో మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 50 నుండి 64 సంవత్సరాల వయస్సు ఉన్న ప్రతి నలుగురు మహిళల్లో ఒకరికి UPF తినే అలవాటు లక్షణాలను ఉన్నట్లు ఉన్నట్లు తేలింది. అదే 65 నుండి 80 సంవత్సరాల వయస్సు వారిలో 12% మందికి మాత్రమే ఈ లక్షణాలను కనిపించాయి. ఈ అధ్యయనంలో పాల్గొన్న మహిళల్లో 17% మంది వ్యసనలకి దగ్గరగా ఉన్నారు. అదే పురుషులలో ఉన్న 7.5% రేటు కన్నా రెండు రెట్లు ఎక్కువ. రిపోర్ట్ ప్రకారం, ఈ జనరేషన్ మహిళలు 'డైట్' స్నాక్స్, తక్కువ కొవ్వు(low faty) ఉన్న ప్యాక్ చేసిన ఆహారాలు మార్కెట్‌లో వచ్చాక పెరిగారు.
ALSO READ : టీబీ(క్షయ) రోగులకు WHO కొత్త గైడ్ లైన్స్..
ఏదైనా అలవాటు కన్నా, ఆహార వ్యసనం ఆకలి వేసినట్లుగా ఉంటుంది. UPFలు నికోటిన్ లేదా ఆల్కహాల్ లాగానే మెదడులో ప్రతిస్పందనలను ప్రేరేపించగలవని అధ్యయనం సూచిస్తుంది. దీనివల్ల తీవ్రమైన ఆకలి కోరికలు, వాటిని తినకపోతే వచ్చే విత్‌డ్రాయల్ లక్షణాలు, తినడంపై అదుపు కోల్పోవడం జరుగుతుంది. దింతో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా అతిగా తినే అలవాటు ఏర్పడుతుంది.
UPF వ్యసనాల లక్షణాలు చూపించిన వారిలో ఆరోగ్యం బాలేదని, ఒత్తిడి ఎక్కువగా ఉందని, సంతోషంగా లేమని చెప్పారు. మహిళల్లో, ఏడాదికి $30,000 కన్నా తక్కువ ఆదాయం ఉన్నవారిలో ఈ వ్యసనం ఎక్కువగా ఉంది. ఇది కేవలం ఆహార సమస్య మాత్రమే కాదు, ప్రజారోగ్య సమస్య అని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
చాలా మంది వృద్ధులకు ఒకప్పుడు ఇది మీకు మంచిది అని ప్రచారమైన ఫుడ్స్ ఇప్పుడు మద్యం, పొగాకులాగ నిశ్శబ్ద వ్యసనంగా మారాయి. ఈ పరిశోధన ఫలితాలు ఒక విషయాన్ని గట్టిగా చెబుతున్నాయి. కొన్నేళ్లుగా లంచ్‌బాక్స్‌లలో, డిన్నర్ టేబుళ్లపై ఉన్న ఆహారాలే ఇప్పుడు కొంతమందికి వ్యసనాన్ని సృష్టిస్తున్నాయి.
ఆహార వ్యసనాన్ని అధిగమించడానికి లేదా దాని నుండి బయటపడడానికి సంకల్పం కంటే ఎక్కువ శక్తి అవసరమని నిపుణులు చెబుతున్నారు. దీనికి అవగాహన, సరైన ప్లాన్, నిపుణుల సహాయం అవసరం. మానసిక వైద్యులు, పోషకాహార నిపుణులు ఆకలి పుట్టించే "ట్రిగ్గర్ ఫుడ్స్" గుర్తించడంపై, అలాగే వాటి స్థానంలో ఆరోగ్యకరమైన ఆహారం క్రమంగా చేర్చడంపై దృష్టి పెడతారు. ఇతర వ్యసనాలలాగానే, అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్(UPF) నుండి బయటపడటం కష్టం, కానీ సరైన పద్ధతి, మార్గదర్శకత్వం, ఆత్మవిశ్వాసంతో దీనిని సాధించవచ్చు.