
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఓ మహిళ ఎనిమిది ఏళ్ల కింద కనిపించకుండా పోయిన తన భర్తను ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో గుర్తించింది. సమాచారం ప్రకారం జితేంద్ర అలియాస్ బబ్లు 2018లో గర్భవతి అయిన తన భార్య షీలును విడిచిపెట్టి పంజాబ్‌లోని లూధియానాలో ఉంటున్నాడని, అక్కడ అతను మరో పెళ్లి చేసుకొని ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. దింతో మొదటి భార్యా ఉండగానే మరొ మహిళను పెళ్లి చేసుకున్నాడనే ఆరోపణలతో అతన్ని పోలీసు అరెస్టు చేసారు.
వివరాలు చూస్తే సందిలా ప్రాంతంలోని మురార్‌నగర్‌కు చెందిన షీలు ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోలో తన భర్తను చూడటంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. దింతో వెంటనే ఆమె పోలీసులను సంప్రదించగా, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అతని గుర్తింపు, లొకేషన్ ఆధారంగా పట్టుకున్నారు.
అటమౌ గ్రామానికి చెందిన జితేంద్ర 2018లో కనిపించకుండా పోయాడని అతని తండ్రి గతంలో ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో షీలు బంధువులు అతనిపై దాడికి పాల్పడ్డారని జితేంద్ర కుటుంబం ఆరోపించింది. సబ్-ఇన్‌స్పెక్టర్ రజనీకాంత్ పాండే నేతృత్వంలోని పోలీసు బృందం లూథియానాకు చెందిన జితేంద్రని అదుపులోకి తీసుకుని, షీలు ఫిర్యాదు ఆధారంగా అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.