
‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఇప్పటికే కొంత పార్ట్ షూట్ పూర్తయింది. తాజాగా కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశారు. ఈ మాసీవ్ యాక్షన్ షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్ జాయిన్ అయినట్టు తెలియజేశారు మేకర్స్. ఈ సందర్భంగా సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ ఖాకీ డ్రెస్‌లో చేతిలో గన్, కూలింగ్ గ్లాసెస్‌తో స్టైలిష్‌గా కూర్చుని కనిపిస్తున్నారు.
ఈ షెడ్యూల్ కోసం ప్రొడక్షన్ డిజైనర్ ఆనంద్ సాయి స్పెషల్ సెట్‌ని రూపొందించారు. మాస్ ని మెప్పించే బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రం ఉండబోతోందని దర్శక నిర్మాతలు చెప్పారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అశుతోష్ రానా, నవాబ్ షా, ‘కేజీఎఫ్’ ఫేమ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.