భారీగా తగ్గిన బండ్ల అమ్మకాలు

భారీగా తగ్గిన బండ్ల అమ్మకాలు
  • సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్‌‌‌‌ రిపోర్ట్

న్యూఢిల్లీ: ప్యాసెంజర్ వెహికల్స్ సేల్స్ డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 13 శాతం తగ్గాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్‌‌‌‌ (సియామ్‌‌‌‌) పేర్కొంది. కిందటి నెలలో ఆటోమొబైల్ కంపెనీలు 2,19,421 వెహికల్స్‌‌‌‌ను సేల్‌‌‌‌ చేశాయని వివరించింది. ప్యాసెంజర్ వెహికల్‌‌‌‌ సేల్స్‌‌‌‌ 2020లోని డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో 2,52,998 యూనిట్లుగా రికార్డయ్యాయి. సియామ్ డేటా ప్రకారం, టూవీలర్ సేల్స్‌‌‌‌ 11 % తగ్గి 10,06,062 యూనిట్లుగా ఉన్నాయి. 2020 లోని డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో 11,27,917 టూ వీలర్లు అమ్ముడయ్యాయి. మోటార్‌‌‌‌‌‌‌‌సైకిల్‌‌‌‌ సేల్స్ కిందటి నెలలో 2 శాతం తగ్గి 7,26,587 యూనిట్లుగా రికార్డయ్యాయి.  అంతకు ముందు ఏడాది ఇదే నెలలో 7,44,237 మోటార్‌‌‌‌‌‌‌‌సైకిల్స్ అమ్ముడయ్యాయి.

2020, డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో 3,23,757 స్కూటర్లు అమ్ముడు కాగా, కిందటి నెలలో ఈ నెంబర్ 2,40,080 యూనిట్లకు తగ్గింది. కిందటేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌–డిసెంబర్ పీరియడ్‌‌‌‌లో ప్యాసెంజర్ వెహికల్ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 15 శాతం తగ్గి 7,61,124 యూనిట్లుగా రికార్డయ్యాయి. 2020 లోని అక్టోబర్‌‌‌‌‌‌‌‌– డిసెంబర్ పీరియడ్‌‌‌‌లో 8,97,908 యూనిట్ల ప్యాసెంజర్ వెహికల్స్‌‌‌‌ సేల్ అయ్యాయి. టూ వీలర్ సేల్స్  ఈ టైమ్ పీరియడ్‌‌‌‌లో 25 శాతం తగ్గి 35,98,299 యూనిట్లుగా ఉన్నాయి.

అంతకు మందు ఏడాది ఇదే టైమ్‌‌‌‌లో 47,82,110 యూనిట్లు సేల్ అయ్యాయి. కమర్షియల్ వెహికల్ సేల్స్‌‌‌‌ మాత్రం అక్టోబర్‌‌‌‌‌‌‌‌–డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో స్వల్పంగా పెరిగాయి. 2020లోని అక్టోబర్‌‌‌‌‌‌‌‌–డిసెంబర్ పీరియడ్‌‌‌‌లో 1,93,034 యూనిట్ల కమర్షియల్ వెహికల్స్ సేల్ అవ్వగా, 2021 అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)  క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో 1,94,712 వెహికల్స్ అమ్ముడయ్యాయి. మొత్తంగా చూస్తే, క్యూ3లో వెహికల్‌‌‌‌ సేల్స్ 22 % తగ్గి 46,36,549 యూనిట్లుగా ఉన్నాయి.