ODI World Cup 2023: అవును.. కోహ్లీ స్వార్థపరుడే.. అతడికి వ్యక్తిగత రికార్డులే ముఖ్యం: భారత దిగ్గజ బౌలర్

ODI World Cup 2023: అవును.. కోహ్లీ స్వార్థపరుడే.. అతడికి వ్యక్తిగత రికార్డులే ముఖ్యం: భారత దిగ్గజ బౌలర్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నిన్న వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికాపై శతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో  67 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ.. 119 బంతుల్లో తన సెంచరీ మార్క్ పూర్తి చేసుకున్నాడు. విరాట్ చేసిన ఈ సెంచరీపై కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారు. తన 49 వ సెంచరీ పూర్తి చేసుకొని సచిన్ రికార్డ్ సమం చేయడం కోసం నిదానంగా బ్యాటింగ్ చేసాడని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. విరాట్ మీద వస్తున్న విమర్శలకు తాజాగా టీమిండియా మాజీ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ స్పందించాడు. 

వెంకటేష్ ప్రసాద్ మాట్లాడుతూ.. కోహ్లీ స్వార్ధపరుడే అనే మాటకు ఎమోషనల్ గా ఒక నోట్ రాసాడు.  ప్రస్తుతం ఈ నోట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. కోహ్లీకి మద్దతు తెలుపుతూ విమర్శలను తిప్పికొట్టాడు. వ్యంగ్యంగా సమాధానమిస్తూ అందరి నోళ్లు మూయించాడు. ఈ నోట్ లో "  అవును.. కోహ్లి స్వార్థపరుడే..కోట్లాది మంది కలలను నిజం చేయడంలో అతడు పూర్తి స్వార్ధంగా వ్యవహరిస్తున్నాడు. కోట్లాది మంది కలలను నిజం చేస్తున్నందుకు అతడిని మనం స్వార్ధపరుడనాలి. ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించినా.. టీమిండియా విజయాల కోసం తపిస్తున్న కోహ్లీని స్వార్ధపరుడనాలి. అతడు జట్టును గెలిపించే స్వార్ధపరుడు. అని ఈ మాజీ బౌలర్ తెలిపాడు. 

ఈ వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ పై సెంచరీ చేసిన కోహ్లీ.. ఆస్ట్రేలియాపై 85, న్యూజిలాండ్ పై 95, శ్రీలంకపై 88 పరుగులు చేసాడు. ఈ మూడు సందర్భాల్లో కోహ్లీ తన సెంచరీ కోసం నిదానంగా బ్యాటింగ్ చేసాడని విమర్శలు వచ్చాయి. జట్టు ప్రయోజనాలను పట్టించుకోకుండా వ్యక్తిగత రికార్డుల కోసం ఆడుతున్నడని కొంతమంది వాదించారు. నిన్న కోల్ కత్తా  ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో సెంచరీల కోసం 119 బంతులు తీసుకోవడంతో ఈ విమర్శలు ఎక్కువయ్యాయి. కోహ్లీ ఇన్నింగ్స్ లో ఒక్క సిక్స్ కూడా కొట్టలేదని.. రిస్క్ చేయకుండా చివర్లో తన సెంచరీ కోసం సింగిల్స్ తీసాడని కొంతమంది భావించారు. 

ఈడెన్ గార్డెన్ పిచ్ పై పరుగులు చేయడం ఎంత కష్టమో ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాను చూస్తే అర్హమవుతుంది. ఫామ్ లో ఉన్న సఫారీలు బ్యాటర్లు విరాట్ చేసిన స్కోర్ కూడా చేయలేక 83 పరుగులకే ఆలౌటయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఈ పిచ్ మీద పరుగులు చేయడం చాలా కష్టమని మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.