వెంకీ అట్లూరి డైరెక్షన్ లో.. లక్కీ భాస్కర్గా దుల్కర్ సల్మాన్

వెంకీ అట్లూరి డైరెక్షన్ లో.. లక్కీ భాస్కర్గా దుల్కర్ సల్మాన్

వెంకీ అట్లూరి(Venky Atluri) డైరెక్షన్ లో దుల్కర్ సల్మాన్(Dulquer Slaman) హీరోగా  లక్కీ భాస్కర్(Lucky Baskhar) టైటిల్ తో మూవీ రాబోతుంది.ఈ మూవీ పోస్టర్ లో.. దుల్కర్ తల చుట్టూ తిరుగుతున్న రూ.100 నోట్లను చూపిస్తూ..అమాంతం స్టోరీ లైన్ ను చెప్పేసారు మేకర్స్. ఈ పోస్టర్ తో ఫ్యాన్స్ లో ఇంటెన్సివ్ వైబ్ పెరుగుతోంది.కాగా ఈ మూవీ పీరియాడికల్ జోనర్ లో సాగుతూ..ఒక  సామాన్యుడు.. ఆ సామాన్యమైన విజయాలను ఎలా సాధించాడు..అందుకు అడ్డొచ్చిన అసమానతలు ఏంటనేది.. ఈ మూవీ స్టోరీ లైన్ అని టాక్ వినిపిస్తోంది. ఇక కరెన్సీ నేపథ్యంలో పాత్రల క్యారెక్టర్స్ ఉంటాయని తెలుస్తోంది. 

రీసెంట్ గా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కించిన మూవీ సార్(తమిళ్‌లో ‘వాతి’) ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి స్టార్ డైరెక్టర్ హోదా తీసుకొచ్చింది. దీంతో డైరెక్టర్ వెంకీ అట్లూరి మంచి ఫామ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. మంచి కంటెంట్ ను సెలెక్ట్ చేసుకునే దుల్కర్ సల్మాన్ ఈ మూవీతో మరో హిట్ కొట్టడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. సీతా రామం మూవీతో ప్రేక్షకులకు మరింత దగ్గరైన విషయం తెలిసేందే.   

మనీ బ్యాక్ డ్రాప్ తో వస్తోన్న లక్కీ భాస్కర్ మూవీను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్  గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. కాగా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరైన  జి.వి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు.