
హీరో విజయ్ దేవరకొండ నటించిన కింగ్‌డమ్ రేపు (జులై31) థియేటర్లోకి రానుంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. పవర్‌ఫుల్ స్పై యాక్షన్ చిత్రంగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించారు. దాదాపు రూ.130 కోట్ల బడ్జెట్ తో నిర్మాత నాగవంశీ నిర్మించారు. ఈ సందర్భంగా కింగ్‌డమ్ మేకర్స్ ఇవాళ (జులై30) గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
Also Read:-ఈడీ విచారణకు ప్రకాష్ రాజ్ హాజరు.. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ పై విచారణ
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ' సినిమా కంటెంట్పై నమ్మకం ఉంది. అదే ఇవాళ నన్ను హ్యాపీగా పడుకోనిస్తుంది. కొన్ని నెలలుగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఇప్పుడు హాయిగా నిద్రపోతున్నా.. ఈ బుకింగ్స్ ఇవన్నీ ప్రజలు ఇచ్చిన ప్రేమే.. ఇప్పుడు అందరూ హిట్ కొడుతున్నాం అని చెప్తుంటే సంతోషంగా ఉంది. ఈ రోజు మా టీమ్ అందరం.. హ్యాపీగా, సంతృప్తిగా ఉన్నారు. ఈ మూవీ స్టోరీ చాలా సెన్సిబుల్. ఈ క్రమంలో సినిమాపై చూపిస్తున్న ఆదరణ చాలా గొప్పగా ఉందని' విజయ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.