
వికారాబాద్, వెలుగు: చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ ప్రభుత్వ ఉద్యోగిపై పోక్సో కేసు నమోదైంది. వికారాబాద్ కలెక్టరేట్ లో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో నరేందర్(45) జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం కృష్ణాష్టమి సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలోకి కొందరు చిన్నారులు ఆడుకోవడానికి వచ్చారు. అందులో ఒకరిని దగ్గరకు తీసుకుని నరేందర్ అసభ్యంగా ప్రవర్తించాడు. విషయాన్ని చిన్నారి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు సంఘటన స్థలానికి వచ్చారు. వారిని చూసిన నరేందర్ చెట్ల పొదల్లో దాక్కున్నాడు. లాక్కొచ్చి కలెక్టరేట్ గేటు బయట దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించగా పోక్సో కేసు నమోదు చేశారు.