
సొంత ఇంట్లో అడుగుపెట్టలేని విధంగా తయారైంది అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరిస్థితి. హైకోర్టు ఆదేశాలున్నా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లలేకపోతున్నారు.కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి ఎంట్రీకి మరోసారి బ్రేకులు పడ్డాయి. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి వెళ్తున్న పెద్దారెడ్డిని మధ్యలోనే పోలీసులు ఆపేశారు.హైకోర్టు ఉత్తర్వులు పోలీసులకు చూపించనప్పటికి తాడిపత్రిలోకి వెళ్లేందుకు అనుమతించడం లేదు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి తీసుకెళ్లాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆయనకు భద్రత కల్పించాల్సిందిగా హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హై కోర్టు ఆదేశాలను పోలీసులు బేఖాతరు చేస్తున్నారని పెద్దారెడ్డి ఆరోపించారు.
హైకోర్ట్ ఆర్డర్ ను ఛాలెంజ్ చేస్తూ పోలీసులు సుప్రీం కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు ( ఆగస్టు 18) న తాడిపత్రిలో జేసీ ప్రభాకరరెడ్డి శివుని విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టారు.
ఇరువర్గాలు ఎదురెదురు పడే అవకాశం ఉండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. శాంతి భద్రతల దృష్ట్యా తాడిపత్రిలోని పెద్దిరెడ్డి... జేసీ నివాసాలను పోలీసులు చుట్టు ముట్టారు.
►ALSO READ | అందరికి సంపదలు కలగాలి.. తిరుమలలో విశ్వశాంతి మహాయాగం