
మానవాళితోపాటు సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ సంగోపాంగ శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం ఆగస్టు 20 వరకు తిరుమలలో నిర్వహించనున్నారు.
భక్తులకు ఐశ్వర్యం, ఆయురారోగ్య సంపదలు కలగాలని కాంక్షిస్తూ తిరుమల ధర్మగిరిలోని శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞానపీఠంలో సంగోపాంగ శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం ఆదివారం ( ఆగస్టు 17) సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో వేద పండితులు ఆచార్యవరణం, మేదినీ పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణం, వేదారంభం కార్యక్రమాలు వైదికంగా నిర్వహించారు.
►ALSO READ | బంగాళాఖాతంలో వాయుగుండం : రేపు తీరం దాటే సమయంలో భారీ వర్షాలు
ఈ మహాయాగం ఆగస్టు 20వ తేది వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించబడుతుంది. మొత్తం 32 మంది వేదపండితుల సమక్షంలో జరిగే ఈ మహాయాగంలో వేదపారాయణం, సుందరకాండ పారాయణం ఇతర వైదిక క్రతువులు జరుగుతాయి. ఆగస్టు 20న పూర్ణాహుతితో యాగం ముగుస్తుందని టీటీడీ తెలిపింది. ఈ మహాయాగంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఎస్వీ వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.