శంకర్పల్లి ఎండీవో భార్య ఆత్మహత్య

శంకర్పల్లి ఎండీవో భార్య ఆత్మహత్య

హైదరాబాద్ లోని హబ్సిగూడలో సోమవారం (ఆగస్టు 18) విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉష (35) అనే గృహిణి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు శంకర్‌పల్లి ఎండీవో వెంకయ్య భార్యగా పోలీసులు గుర్తించారు. 

ప్రాథమిక సమాచారం ప్రకారం.. భార్యభర్తల మధ్య కలహాలే ఉష ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. 2009లో ఉషకు ఎండీవో వెంకయ్యతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

►ALSO READ | హైదరాబాద్ శ్రీ కృష్ణుడి రథానికి కరెంట్ షాక్ ఎలా కొట్టింది..