వైరల్ వీడియో: ఫోన్ చూసుకుంటూ రైలు పట్టాలపై పడ్డాడు

వైరల్ వీడియో: ఫోన్ చూసుకుంటూ రైలు పట్టాలపై పడ్డాడు

మొబైల్ ఫోన్ చూసుకుంటూ నడవడం ప్రాణాలమీదకు తెచ్చిపెడుతుంది. రోడ్లపై.. ఎక్కడపడితే అక్కడ ఫోన్ చూసుకుంటూ నడవడం ఎలాంటి అనర్థాలకు దారితీస్తుందో తెలిసిందే. అలాంటి వీడియోలు  చాలా చూశాం. తాజాగా ఇదే కోవలోనే ఓ వ్యక్తి రైల్వే స్టేషన్లోకి అడుగుపెట్టినా పోన్లో మునిగిపోయి.. ప్లాట్ ఫారం మీద నుంచి రైలు పట్టాలపై పడ్డాడు. అదే సమయంలో ఎలాంటి రైళ్ల రాకపోకలు లేకపోవడంతో బతికిపోయాడు.  అదృష్టం బాగుండబట్టి ప్రాణాపాయం లేకుండా బయటపడ్డాడు. నిన్న శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలోని షాహదరా మెట్రో స్టేషన్లో జరిగిన ఘటన సీసీ కెమెరాలో రికార్డయింది.  ఈ సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
ఢిల్లీ నగరంలో  నివాసం ఉంటున్న శైలేంద్ర మెహతా అనే వ్యక్తి మొబైల్ ఫోన్ బ్రౌజింగ్ చేసుకుంటూ.. మెట్రో స్టేషన్ లో ప్లాట్ ఫాం నెంబర్ 1పైకి వచ్చాడు. ఫోన్లోనే లీనమైపోయి రైలు పట్టాలపై పడ్డాడు. దీంతో ఒక్కసారిగా రైల్వే స్టేషన్లో కలకలం రేగింది. పట్టాలపై పడడంతో గట్టి దెబ్బలే తగిలినట్లున్నాయి.. వెంటనే లేవలేక పోయాడు. అయితే సీఐఎస్ఎఫ్ కానిస్టేబుళ్లు గమనించి అప్రమత్తం చేశారు. ఈ ఘటన సీసీ కెమెరా ఫుటేజీని సీఐఎస్ఎఫ్ ట్వీట్ చేయడం వైరల్ అయింది.  ప్లాట్ ఫామ్ 2లోంచి  కానిస్టేబుళ్లు పరిగెత్తుకుంటూ రాగా..  కానిస్టేబుల్ రాథోష్ చంద్ర పట్టాలపై దూకి లేవడానికి కష్టపడుతున్న శైలేంద్ర మెహతాను ఎత్తి ప్లాట్ ఫాం పైకి చేర్చాడు. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డయింది.   

 

 

 

 

ఇవి కూడా చదవండి: 

రాష్ట్రంలో ఇవాళ  కొత్త కేసులు 2,098, మరణాలు 2

మోడీ వచ్చాక దేశ ప్రజలు తలెత్తుకుని బతుకుతున్నారు

స్కూల్స్ రీఓపెన్ చేయండి.. లేకుంటే ఓటేయ్యం

యోగి వద్ద కోటిన్నర ఆస్తులు, రివాల్వర్‌‌, రైఫిల్