
- చినజీయర్ స్వామి
హైదరాబాద్: రామానుజాచార్యుల అంతటి గొప్ప గుణాలు కలిగిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని చినజీయర్ స్వామి కొనియాడారు. రానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో భాగంగా శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో ఏర్ప్టాటు చేసిన 216 అడుగుల ఎత్తైన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. 54 అడుగుల ఎత్తు ఉన్న భద్రవేది బేస్‌పై అమర్చిన సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చినజీయర్ స్వామి మాట్లాడుతూ పవిత్ర భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ సమతామూర్తి విగ్రహన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. రామానుజాచార్యుల అంతటి గొప్ప గుణాలు కలిగిన ప్రధాని మోడీ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కంకణబద్దుడై పని చేస్తున్నారని కొనియాడారు. మోదీ వచ్చాక దేశ ప్రజలు తలెత్తుకొని బతుకున్నారని ఆయన పేర్కొన్నారు. ‘మోదీ వచ్చాక కశ్మీర్ మన సొంతమైంది.. ప్రపంచంలో మన దేశాన్ని తలెత్తుకొని ఉండేలా చేస్తున్నారు.. ఎంతో ప్రేమతో కష్టపడి మోదీ ఇక్కడికి వచ్చి సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు ధన్యవాదాలు..రామానజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించి దేశ ఔన్నత్యాన్ని చాటారు..’ అని చినజీయర్ స్వామి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
మోడీ వచ్చాక దేశ ప్రజలు తలెత్తుకుని బతుకుతున్నారు
స్కూల్స్ రీఓపెన్ చేయండి.. లేకుంటే ఓటేయ్యం
యోగి వద్ద కోటిన్నర ఆస్తులు, రివాల్వర్, రైఫిల్
ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయకుంటే నిరసన కాదా?