కోడిని అరెస్ట్ చేసిన పోలీసులు

కోడిని అరెస్ట్ చేసిన పోలీసులు

సాధారణంగా నేరాలు చేస్తున్న మనుషుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తుంటారు. కానీ జంతువుల్ని,పక్షుల్ని మాత్రం అరెస్ట్ చేసిన సందర్భాలు చాలా అరుదు. తాజాగా ఓ కోడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అమెరికాలో జరిగింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ హెడ్‌క్వార్టర్స్ సమీపంలో ఓ కోడి అనుమానాస్పదంగా తిరుగుతోంది. దాన్ని చూసిన పోలీసులు వెంటనే దాన్ని పట్టుకున్నారు. కోడిని పట్టుకొని క్షుణ్ణంగా పరీక్షలు చేశారు. ఇంతకీ ఆ కోడి ఎవరిది? అంత సెక్యూరిటీ ఏరియాలోకి ఆ కోడి ఎలా వచ్చింది? ఈ కోడి వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందా? అనే కోణాల్లో పరిశీలించారు. 

ఈ విషయాన్ని వర్జీనియాలోని ఆర్లింగ్టన్‌కు చెందిన జంతు సంక్షేమ సంఘం సోషల్ మీడియాలో తెలిపింది. భద్రతా తనిఖీ కేంద్రం వద్ద ఓ కోడి అనుమానంగా తిరుగుతోందని..దానిని తీసుకెళ్లేందుకు తమ అధికారులను పిలిచారని జంతు సంరక్షణ సంఘంలోని ఓ ఉద్యోగి తన ఫేస్‌బుక్ పేజీలో వివరించారు. గోధుమ రంగు ఈకలు కలిగిన ఈ కోడి పేరు హెన్నీ పెన్నీ.  ఈ కోడిని పశ్చిమ వర్జీనియాలో ఓరైతు నిర్వహిస్తున్న కోళ్ల ఫామ్‌ నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. రైతుకు ఈ కోడి అంటే చాలా ఇష్టమట. అందుకే దానికి ముద్దుగా హెన్నీ పెన్నీ అని పేరు పెట్టుకుని పెంచుకుంటున్నాడు. అతను ఆ కోడిని దత్తత తీసుకుంటున్నాడట

ఇవి కూడా చదవండి: 

ప్రధాని పర్యటనకు కేసీఆర్ దూరం

కశ్మీర్‌‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత