కశ్మీర్‌‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత

కశ్మీర్‌‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత

జమ్ము కశ్మీర్‌‌లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. కశ్మీర్ లోయ సహా జమ్ము డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రతతో భూమి కంపించిందని జాతీయ భూకంప అధ్యయనం కేంద్రం వెల్లలడించింది. శనివారం ఉదయం 9.45 గంటల సమయంలో ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో జనం భయంతో పరుగులు తీశారు. భూకంప కేంద్రం అఫ్గాన్, తజకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో 180 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్ర అధికారులు తెలిపారు. అయితే భూప్రకంపన స్థాయి తక్కువగానే ఉండడంతో కొద్దిసేపు అలజడి మాత్రమే నెలకొంది. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. 

ఉత్తరాఖండ్, యూపీల్లోనూ పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. ఉత్తర కాశీ జిల్లాలో రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయి. అలాగే ఈ రోజు ఉదయం ఢిల్లీ, నోయిడా సహా ఉత్తర భారతంలోని పలు చోట్ల భూమి కంపించింది.

మరిన్ని వార్తల కోసం..

26 ఏండ్లుగా ధర్నా చేస్తున్న టీచర్

పీవీని ఓడించిన బీజేపీ నేత మృతి..తెలుగులో మోడీ సంతాపం

ఒక రాత్రి వీళ్లకు కళ్లు కనబడకుండా చూడు