స్కూల్స్ రీఓపెన్ చేయండి.. లేకుంటే ఓటేయ్యం

స్కూల్స్ రీఓపెన్ చేయండి.. లేకుంటే ఓటేయ్యం

పంజాబ్‌లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వెంటనే స్కూల్స్ తెరవాలని డిమాండ్ చేశారు. స్కూళ్లు తెరవకపోతే... ఎన్నికల్లో ఓటు వేయమన్నారు. కరోనా కేసుల పెరుగుదలతో పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 8 వరకు స్కూల్స్ బంద్ చేశారు. కేవలం విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు మాత్రమే నిర్వహిస్తున్నారు. దీంతో రోడ్డెక్కిన ఉపాధ్యాయులు, విద్యార్థులు వెంటనే స్కూల్స్ తెరవాలని డిమాండ్ చేశారు. బర్నాల జిల్లాలోని వంద మందికి పైగా నిరసన కారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేశారు. 

గతేడాది కూడా కరోనా కారణంగా 9నెలల పాటు స్కూల్స్ మూతపడ్డాయన్నారు. ఈ ఏడాది కూడా జనవరి 5 నుంచి స్కూల్స్ ను బంద్ చేశారన్నారు. అయితే ఇప్పుడు స్కూల్ స్టాఫ్... పిల్లలు కూడా వ్యాక్సిన్ తీసుకున్నారని.. అందుకే వెంటనే స్కూల్స్‌ను రీఓపెన్ చేయాలని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కొందరు తల్లిదండ్రులు మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్లో చదవడం వల్ల తమ పిల్లల కళ్లు పాడవుతున్నాయన్నారు. ఎన్నికల కోసం బయట ర్యాలీలు చేస్తున్నప్పుడు.. స్కూల్స్ మాత్రం ఎందుకు మూసివేయాలని ప్రశ్నించారు. ఫిబ్రవరి 8వరకు మేమంతా ఎదురు చూస్తామని.. ఆ తర్వాత మాత్రం స్కూల్ రీఓపెన్ చేయాలని టీచర్లు, పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి: 

కోడిని అరెస్ట్ చేసిన పోలీసులు

 

ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయకుంటే నిరసన కాదా?

కశ్మీర్‌‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత