చీర కట్టుకొని రోడ్లపై స్కేటింగ్ చేస్తున్న యువతి

చీర కట్టుకొని రోడ్లపై స్కేటింగ్ చేస్తున్న యువతి

మలయాళీ సంప్రదాయ చీరకట్టులో కేరళ రోడ్లపై స్కేటింగ్ చేస్తున్న యువతి వీడియో వైరల్ గా మారింది. కేరళకు చెందిన లారెసాకు ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం. ట్రావెలింగ్ ఎక్స్ పీరియన్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. చీర కట్టుకుని స్కేట్ బోర్డుపై స్కేటింగ్ చేస్తున్న వీడియో ఇన్ స్టాలో పోస్ట్ చేయగానే నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. లారెసా తెల్లటి కాటన్ చీరను కట్టుకుని, బన్నులో జుట్టును కట్టుకుని, కేరళలోని రోడ్లపై తిరుగుతున్నట్లు వీడియో నెటిజనులను ఆకట్టుకుంటోంది.

సుందరమైన ప్రకృతిలో, తాటి చెట్లు, పచ్చటి దృశ్యాలు నడుమ లారెసా వయ్యారంగా స్కేట్ బోర్డుపై ముందుకు సాగుతుండగా వివిధ కోణాల నుండి కొన్ని ఏరియల్ షాట్‌లు కూడా మిక్స్‌ చేయడంతో వీడియో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. చీర కట్టుకుని, అది కూడా ఎలాంటి సేఫ్టీ గేర్ లేదా హెల్మెట్ లేకుండా రోడ్డుపై స్కేటింగ్ చేస్తుండడం సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసిన లారెసా చీరకట్టుకుని స్కేటింగ్ సులభం కాదని... అయినా సాధించానని ట్యాగ్ జతచేశారు. స్కేటింగ్ చేస్తున్నంతసేపు జనాలు సెల్ఫీ దిగడం ఫన్ అని అన్నారు లారెసా.