
హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విశ్వక్ సేన్.. రచయితగా, దర్శక నిర్మాతగా కూడా తానెంటో ప్రూవ్ చేసుకున్నాడు. హీరోగా, దర్శకుడిగా ఇప్పటికే రెండు చిత్రాలను రూపొందించగా, తాజాగా మూడో మూవీని మొదలుపెట్టాడు. ‘కల్ట్’ టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించాడు. ఇందులో తాను హీరోగా నటిస్తూ దర్శకత్వం చేయనున్నాడు. తన సొంత బ్యానర్ వన్మయి క్రియేషన్స్ బ్యానర్‌పై ఆయన తండ్రి కరాటే రాజుతో కలిసి సందీప్ కాకర్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఆదివారం పూజా కార్యక్రమాలతోఈ సినిమాను ప్రారంభించారు. నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ కెమెరా స్విచాన్ చేశారు.
మరో నిర్మాత ఎస్ రాధాకృష్ణ (చిన బాబు) టైటిల్ లోగోను లాంచ్ చేశారు. రియల్ ఇన్సిడెంట్స్‌తో న్యూ ఏజ్ థ్రిల్లర్‌గా దీన్ని రూపొందిస్తున్నట్టు, ఈ సినిమాతో 40 మంది కొత్త నటులను పరిచయం చేస్తున్నట్టు విశ్వక్ సేన్ తెలియజేశాడు. ఆదివారం నుంచే రెగ్యులర్ షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేస్తున్నాం అన్నాడు. దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్‌ను, రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, జపనీస్, స్పానిష్ , ఇంగ్లీష్ భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.