జూలై 10 న విశ్వంభర రిలీజ్.!

జూలై 10 న   విశ్వంభర రిలీజ్.!

చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ‘విశ్వంభర’. త్రిష, ఆశికా రంగనాథ్ హీరోయిన్స్‌‌గా నటిస్తున్నారు. ‘బింబిసార’ ఫేం వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకురావల్సిన ఈ చిత్రం వీఎఫ్‌‌ఎక్స్‌‌ వర్క్‌‌లో జాప్యంతో ఆలస్యమైంది.  తాజాగా రిలీజ్‌‌ డేట్‌‌ విషయంలో బజ్ వినిపిస్తోంది. ఈ ఏడాది జులై 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

 సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఈ రిలీజ్‌‌ డేట్‌‌పై నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. టీజర్‌‌‌‌లోని వీఎఫ్‌‌ఎక్స్‌‌ వర్క్‌‌కు విమర్శలు రావడంతో ఆ విషయంలో ప్రత్యేకశ్రద్ధ వహిస్తున్నారు మేకర్స్‌‌. కునాల్ కపూర్ విలన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఇషా చావ్లా, సురభి, రమ్య పసుపులేటి కీలకపాత్రలు పోషిస్తున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్‌‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న చిరంజీవి.. త్వరలో బాబీ తెరకెక్కించబోయే చిత్రంలో నటించబోతున్నారు.