శివ్వంపేట, వెలుగు: నర్సాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ పదవిని కాంగ్రెస్ కైవసం చేసుకున్న సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డిని మంత్రి వివేక్ వెంకటస్వామి అభినందించారు. రాజిరెడ్డి బుధవారం హైదరాబాద్ లో మంత్రిని కలిశారు.
నర్సాపూర్ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని మంత్రిని కోరారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లేశ్, మాజీ ఎంపీపీ లలిత, నాయకులు నవీన్ గుప్తా ఉన్నారు.
