ఎంబీఏ విద్యార్థులకు మార్కెట్ లో మంచి భవిష్యత్తు

ఎంబీఏ విద్యార్థులకు మార్కెట్ లో మంచి భవిష్యత్తు

ముషీరాబాద్, వెలుగు: స్టూడెంట్లకు వ్యక్తిత్వం చాలా ముఖ్యమని  అంబేద్కర్ విద్యా సంస్థల చైర్మన్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. పోటీ ప్రపంచంలో ఎంబీఏ స్టూడెంట్లకు ఎన్నో అవకాశాలున్నాయని.. ఇష్టంగా పనిచేస్తే ఏదైనా సాధ్యమేనని ఆయన చెప్పారు. శనివారం బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ అండ్ టెక్నాలజీలో ‘సయోనర 2కే– 2022’ పేరుతో ఎంబీఏ స్టూడెంట్ల ఫేర్ వెల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. చీఫ్ గెస్టులుగా వివేక్ వెంకటస్వామి, విద్యా సంస్థల కరస్పాండెంట్ సరోజా వివేక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్కెటింగ్​లో ఎంబీఏ స్టూడెంట్లకు మంచి భవిష్యత్ ఉందన్నారు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. అనంతరం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లు ఔట్ గోయింగ్ బ్యాచ్​కు వీడ్కోలు పలికారు. ఫేర్​ వెల్ డే లో భాగంగా స్టూడెంట్ల కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి. క్లాసికల్, ఫోక్, వెస్ట్రన్ డ్యాన్స్​లతో అదరగొట్టారు. విద్యాసంస్థల డైరెక్టర్ రామకృష్ణ మోహన్ రావు, అడ్మిన్ ఆఫీసర్ కిరణ్ కుమార్, అకౌంట్ ఆఫీసర్ అమిత్ సింగ్, హెచ్ ఆర్ పవన్ కుమార్, ఎంబీఏ కాలేజీ ప్రిన్సిపల్ నాగరాజా, లా కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సృజన, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ వేదాంతం రవి, జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ వసుంధర, స్కూల్ ప్రిన్సిపల్ విఠలాచారి, ఫ్యాకల్టీ పాల్గొన్నారు.