ఫొటోగ్రాఫీ కోసం వివో కొత్త 5జి ఫోన్స్.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్ అంతే.. త్వరలోనే లాంచ్..

 ఫొటోగ్రాఫీ కోసం వివో కొత్త 5జి ఫోన్స్.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్ అంతే.. త్వరలోనే లాంచ్..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్మార్ట్ ఫోన్ లవర్స్ కి గుడ్ న్యూస్. వివో X300 5G, వివో X300 Pro 5G డిసెంబర్ 2న ఇండియాలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఇండియాలో మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది, అదే రోజు దీని ధర, సేల్స్ సమాచారం వెల్లడవుతుంది. ఈ రెండు ఫోన్‌లను అక్టోబర్‌లో చైనాలో ఆవిష్కరించారు, ఇప్పుడు మన దేశంలో లాంచ్ చేసేందుకు రెడీగా ఉన్నారు.

Vivo X300 5G వేరియంట్ బ్రౌన్ & బ్లాక్ ఆప్షన్లతో పాటు  ఇండియన్స్ కోసం ప్రత్యేకమైన రెడ్ కలర్ అప్షన్ కూడా ఉందని  కంపెనీ తెలిపింది. Vivo ప్రో లెవల్ జూమ్ కోసం Zeiss 2.35x టెలికాన్వర్టర్ లెన్స్‌తో  స్పెషల్ ఫోటోగ్రాఫి కిట్‌ను కూడా విడుదల చేస్తోంది. 

 ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, వివో స్టోర్‌ల ద్వారా ప్రీ బుకింగ్‌లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వివో X300 5G ధర రూ. 60 వేల  కంటే తక్కువగా ఉండవచ్చని కానీ వివో X300 ప్రో 5G ధర రూ. 80వేల వరకు ఉండవచ్చని పుకార్లు వస్తున్నాయి.

వివో X300 స్పెసిఫికేషన్లు:
ఈ ఫోన్లు చైనాలో ఆవిష్కరించిన స్పెసిఫికేషన్లు ఇప్పటికే అందరికి తెలిసే ఉంటుంది. Vivo X300 6.31-అంగుళాల 1.5K LTPO AMOLED డిస్‌ప్లే, 2640 x 1216 పిక్సెల్‌ల రిజల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, HDR10+ సపోర్ట్, 1-120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌, 2160Hz PWM డిమ్మింగ్, DC-లాంటి డిమ్మింగ్ అండ్  ఆర్మర్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. 

ఈ ఫోన్ ఆక్టా-కోర్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్‌తో ఆర్మ్ మాలి-జి1 అల్ట్రా ఎంసి12 జిపియుతో పనిచేస్తుంది. 12GB లేదా 16GB LPDDR5X RAM, 256GB, 512GB, లేదా 1TB స్టోరేజ్ అప్షన్లో  వస్తుంది. కెమెరా సిస్టమ్‌లో 1/1.4-అంగుళాల శామ్‌సంగ్ HPB సెన్సార్, f/1.68 ఎపర్చర్‌తో 200-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, శామ్‌సంగ్ JN1 సెన్సార్, f/2.0 ఎపర్చర్‌తో 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, f/2.57 ఎపర్చర్ & 3x ఆప్టికల్ జూమ్‌తో 50-మెగాపిక్సెల్ సోనీ LYT602 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరా f/2.0 ఎపర్చర్‌తో 50-మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

ఇతర ఫీచర్లలో ఇన్-డిస్ ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్, USB టైప్-C ఆడియో, స్టీరియో స్పీకర్లు, హై-ఫై ఆడియో, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 6040mAh బ్యాటరీ ఉంది. కనెక్టివిటీ అప్షన్స్ లో  5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, మల్టి GPS బ్యాండ్స్, NFC ఉన్నాయి. ఫోన్ 150.57x71.92x7.95mm సైజులో 190g బరువు, IP68 & IP69 రేటింగ్‌ పొందింది. 

వివో X300 ప్రో స్పెసిఫికేషన్లు:
Vivo X300 Pro 6.78-అంగుళాల 1.5K LTPO AMOLED డిస్‌ప్లేతో 2800x1260 పిక్సెల్‌ల రిజల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, HDR10+ సపోర్ట్, 1-120Hz రిఫ్రెష్ రేట్,  4500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇది 2160Hz PWM డిమ్మింగ్, DC-లాంటి డిమ్మింగ్,  ఆర్మర్ గ్లాస్ ప్రొటెక్షన్‌ కూడా ఉంది. ఈ ఫోన్  ఆర్మ్ మాలి-G1 అల్ట్రా MC12 GPUతో అదే ఆక్టా-కోర్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్‌తో శక్తిని పొందుతుంది.  256GB, 512GB లేదా 1TB UFS 4.1 స్టోరేజ్‌తో 12GB లేదా 16GB LPDDR5X RAM (శాటిలైట్ ఎడిషన్‌లో LPDDR5X అల్ట్రా ప్రో క్వాడ్-ఛానల్) లభిస్తుంది.

దీని కెమెరా సెటప్‌లో 1/1.28-అంగుళాల సోనీ LYT828 సెన్సార్ & f/1.57 అపెర్చర్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ  కెమెరా, f/2.0 అపెర్చర్‌తో 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా,  f/2.67 అపెర్చర్ & 3.7x ఆప్టికల్ జూమ్‌తో 200-మెగాపిక్సెల్ శామ్‌సంగ్ HPB పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ముందు కెమెరా f/2.0 అపెర్చర్‌తో 50-మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరా ఇచ్చారు. ఫోన్‌లో డ్యూయల్ ఇమేజింగ్ చిప్స్ (V3+ & VS1), ఇన్-డిస్ ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, USB టైప్-C ఆడియో, స్టీరియో స్పీకర్లు, హై-ఫై ఆడియో,  90W ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 6510mAh బ్యాటరీ ఉంది. 

కనెక్టివిటీ అప్షన్స్ లో 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, మల్టి  GPS బ్యాండ్‌లు, NFC ఉన్నాయి. ఫోన్ సైజ్ 161.98x75.48x7.99mm, బరువు 226g,  IP68 & IP69 రేటింగ్‌ పొందింది.