వక్ఫ్ పేరుతో అన్యాయం జరుగుతోంది

వక్ఫ్  పేరుతో అన్యాయం జరుగుతోంది

గద్వాల, వెలుగు: వక్ఫ్  పేరుతో అన్యాయం జరుగుతోందని మహబూబ్ నగర్  ఎంపీ డీకే అరుణ తెలిపారు. శనివారం గద్వాలలోని డీకే బంగ్లాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ఆధ్వర్యంలో వక్ఫ్  సవరణ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. చట్ట సవరణతో పేద ముస్లింలకు లాభం జరుగుతుందన్నారు. కొందరు ముస్లిం పెద్దల చేతుల్లో ఆస్తులు ఉండిపోయాయని, వక్ఫ్  బిల్లు క్రమబద్ధీకరణతో భవిష్యత్తులో ముస్లిం సమాజానికి మేలు జరుగుతుందన్నారు. పెహల్గామ్  ఘటనను  ముక్తకంఠంతో ఖండించాలన్నారు. అప్సర్  పాషా, డీకే స్నిగ్దారెడ్డి పాల్గొన్నారు.

వనపర్తి: వక్ఫ్  సవరణ చట్టంతో దర్గా, మసీదు, మదర్సా ఆస్తులకు నష్టమేమీ లేదని మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అఫ్సర్​ పాషా తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ అధ్యక్షతన వక్ఫ్  సవరణ బిల్లుపై వర్క్ షాప్  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్  ముస్లిం ఓట్ల కోసం వక్ఫ్​ బిల్లు తీసుకొచ్చి లక్షలాది ఎకరాలను అక్రమార్కులకు ధారాదత్తం చేసిందని, వాటిని సరి చేసేందుకు యత్నిస్తున్న ప్రధాని మోదీపై ముస్లింలను ఎగదోస్తున్నారని విమర్శించారు. భరత్ ప్రసాద్, చింతల రామచంద్రారెడ్డి, వెంకట్ రెడ్డి,  ప్రభాకర్ రెడ్డి, శ్రీశైలం గౌడ్, హేమారెడ్డి, రామన్ గౌడ్, సీతారాములు, సుమిత్రమ్మ, పెద్దిరాజు, అరవింద్  
పాల్గొన్నారు.