కెనడాలోని మాంట్రియల్‌‌లో యాదగిరీశ్వరుడి కల్యాణం

కెనడాలోని మాంట్రియల్‌‌లో యాదగిరీశ్వరుడి కల్యాణం
  • త్వరలో బ్రిటన్, యూరోప్, మలేషియాలో కూడా: ఈవో వెంకటరావు

హైదరాబాద్​, వెలుగు: కెనడాలోని మాంట్రియల్ నగరంలో యాదగిరీశ్వరుడి కల్యాణోత్సవం  వైభవంగా జరిగింది. టీసీఏ ప్రెసిడెంట్​  శ్రీనివాస్ మన్నెం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.  యాదగిరిగుట్ట ఆలయం నుంచి ఏఈవో రఘు, ఆలయ విశ్రాంత ప్రధానర్చకుడు ఎన్‌‌. లక్ష్మీ నరసింహచార్యులు హాజరై కల్యాణోత్సవాన్ని జరిపించారు. 

ఈ సందర్భంగా యాదగిరి గుట్ట ఈవో వెంకటరావు, అర్చకులు, ఉద్యోగులను మంత్రి కొండా సురేఖ అభినందించారు. అనంతరం ఈవో  మాట్లాడుతూ.. త్వరలో బ్రిటన్, యూరోప్, మలేషియాలో కూడా యాదగిరీశ్వరుడి కల్యాణోత్సవాలు నిర్వహించేందుకు మరికొన్ని బృందాలను పంపిస్తామని తెలిపారు.