క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో వెస్టిండీస్ బ్యాటింగ్‌లో తడబడింది. టాగెనరైన్ చందర్‌పాల్ (52), షాయ్ హోప్ (56) మినహా మిగతా వారు నిరాశపర్చడంతో.. రెండో రోజు బుధవారం విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 75.4 ఓవర్లలో 167 రన్స్‌కే కుప్పకూలింది. కివీస్ బౌలర్లు జాకబ్ డఫీ (5/34), మ్యాట్ హెన్రీ (3/43), జాక్ ఫౌల్కేస్ (2/32) అద్భుతంగా బౌలింగ్ చేశారు.
దాంతో కరీబియన్ ఇన్నింగ్స్‌లో ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ ఆట ముగిసే టైమ్‌కు 7 ఓవర్లలో 32/0 స్కోరు చేసింది. టామ్ లాథమ్ (14 బ్యాటింగ్), డేవన్ కాన్వే (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 231 రన్స్‌కు ఆలౌటైన కివీస్ ఓవరాల్‌గా 96 రన్స్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
