Mental Health : అతిగా.. ఎక్కువగా ఆలోచిస్తున్నారా.. అయితే ఈ చిట్కాలతో బయటపడొచ్చు.. !

Mental Health : అతిగా.. ఎక్కువగా ఆలోచిస్తున్నారా.. అయితే ఈ చిట్కాలతో బయటపడొచ్చు.. !

ఖాళీ బుర్రలో వంద ఆలోచన తిరుగుతూనే ఉంటాయి. అలా రోజులో కొంతసమయం వరకు అయితే ఒకే.. కానీ రోజంతా ఓవర్ థింకింగ్ చేస్తే దాని వల్ల అనేక మానసిక రోగాల బారిన పడతామని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడూ ఆలోచనలు మీ చుట్టుముట్టినల్లు ఉన్నా అవి ఏ పని చేయనివ్వవు. ఓవర్ థింకింగ్ వల్ల డిప్రెషన్ లోకి వెళ్తారు. అతిగా ఆలోచించడం వల్ల మనకు  తెలియకుండానే ఎక్కవగా నష్టపోతాము. ఓవర్ థింకింగ్ ని అవైడ్ చేయడాన్ని కొన్ని చిట్కాలు కొన్ని తెలుసుకోండి.

మీ ఆలోచనలను ఎవరితోనైనా పంచుకోండి: ఎక్కువ టైం థింక్ చేస్తూనే ఉండకుండా ఇతరులతో మీ ఆలోచనలను షేర్ చేసుకుంటే.. ఓవర్ థింకింగ్ టైం తగ్గుతుంది.

బిజీగా ఉండటానికి ట్రై చేయండి: ఖాళీగా ఉండకుండా ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండటానికి ట్రై చేయండి. పనిలో పడితే మీ ఆలోచనలను తగ్గుతాయి.

మెడిటేషన్: ఏ ఆలోచనలు మనసులోకి రాకుండా ఉండటానికి ప్రశాంతమైన వాతావరణంలో ధ్యానం చేయండి.

నెగిటివ్ థాట్స్ ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండండి: మీ గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడుతూ.. నెగిటీవ్ థాట్స్ స్ప్రెడ్ చేసే వ్యక్తులకు దూరంగా ఉండండి. అలాంటి వారి మాటలు మిమ్మల్ని ఎక్కువగా ఆలోచింపజేస్తాయి.

డైరీ మెయిన్‌టైన్ చేయండి: రోజంతా ఏం చేశారనే దాని కోసం, అలాగే మీరు బిజీగా ఉండటానికి ఏం ఏం చేశారని డైరీ రాసుకోండి. 

ట్రావెల్ చేయడం: కొత్త కొత్త ప్రాంతాలను విజిట్ చేయడం వల్ల మీరు మనసుకు ప్రశాంతత పొందుతారు. ట్రావెల్ మొమరీస్ మీ ఆలోచనలను భర్తీ చేస్తాయి. అందుకే ఓవర్ థింకర్స్ టైం దొరికితే టూర్ అండ్ ట్రావెలింగ్ కు వెళ్లాలి.