
మలయాళ సినిమాలను చూసే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది.మలయాళం మూవీస్ పై ఇంట్రస్ట్ పెరగడానికి కారణం..వారి సహజమైన కాన్సెప్ట్. ఇక ఆ సినిమా విజయం ఆ కాన్సెప్ట్ను ఎంచుకోవడంలోనే ఉంటుంది.
డ్రగ్స్,మాఫియా,టెర్రిరిజం,సైబర్ క్రైమ్స్ అంటూ అదీ ఇదీ కాదు..సొసైటీకి ఉపయోగపడేవి,ప్రేక్షకులు తమను తాము రిలేట్ చేసి చూసుకునే కథలు ఎంచుకుంటారు.అందుకే మలయాళ సినిమా హద్దులు చెరిపేస్తూ..మనది అనే ఫీల్ ను ఇస్తోంది.ఓటీటీలు వచ్చాక మరింత దగ్గరైందనే చెప్పుకోవాలి.
తాజా విషయానికి వస్తే..మలయాళ స్టార్ హీరో బిజుమీనన్,విలక్షణ నటుడు ఆసిఫ్ అలీ హీరోలుగా నటించిన లేటెస్ట్ మలయాళం మూవీ తలవన్(Thalavan). క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోన్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది.మే 24న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ సెప్టెంబర్ లో స్ట్రీమింగ్ కానుంది.దాదాపు పది కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీ రూ.25 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్‌గా నిలిచింది.
ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్లుగా బిజు మీనన్,ఆసిఫ్ అలీ తమ యాక్టింగ్‌తో పాటు కథ,ట్విస్ట్ బాగున్నాయంటూ తలవన్ మూవీపై ఆడియెన్స్ ప్రశంసలు కురిపించారు.ఓ పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా మలయాళ స్టార్ డైరెక్టర్ జిస్ జాయ్ ఈ సినిమాను ఎంతో చక్కగా తెరకెక్కించారు.క్రైమ్ జోనర్ను ఇష్టపడే వారికి ఫుల్ మీల్స్ అనే చెప్పుకోవాలి.అయితే,బిజు మీనన్ పోలీస్ పాత్రలో నటించిన ప్రతి సినిమా హిట్ అవ్వడం విశేషం.బిజుమీనన్ తెలుగులో గోపిచంద్ నటించిన రణం మూవీతో పాటు రవితేజ ఖతర్నాక్ సినిమాలో విలన్ రోల్ చేశాడు.