Bharateeyudu 2: భారతీయుడు -2 టీంకి నా ప్రత్యేక అభినందనలు: సీఎం రేవంత్ రెడ్డి

Bharateeyudu 2: భారతీయుడు -2 టీంకి నా ప్రత్యేక అభినందనలు: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమానికి ఇటీవలే చిరంజీవి,జూ.ఎన్టీఆర్ మద్దతు పలికిన విషయం తెలిసిందే. ఈ మేరకు రూపొందించిన ఓ వీడియోలో వీరిద్దరూ డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం చేశారు. ఇపుడు తాజాగా భారతీయుడు-2 (Bharateeyudu 2) చిత్ర బృందం డ్రగ్స్ రహిత సమాజం కోసం తమ వంతు కర్తవ్యాన్ని తెలుపుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు.ఈ వీడియోపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందిస్తూ వారిని అభినందించారు. 

భారతీయుడు -2 సినిమా బృందానికి నా ప్రత్యేక అభినందనలు అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా భారతీయుడు -2 మేకర్స్ కు బెస్ట్ విషెష్ తెలుపుతూ పోస్ట్ చేశారు. "డ్రగ్స్ రహిత సమాజం కోసం..ప్రజా ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నానికి మద్ధతుగా..శ్రీ కమల్ హాసన్..శ్రీ శంకర్..శ్రీ సిద్దార్థ..శ్రీ సముద్రఖని కలిసి ఒక అవగాహనా వీడియో రూపొందించడం హర్షించదగ్గ విషయం"  అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

ఈ వీడియోలో క‌మ‌ల్ హాస‌న్‌ మాట్లాడుతూ.."మీరు వెళ్లే మార్గం మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. దయచేసి డ్రగ్స్ ని అరికట్టండి. ఇందుకు డ్రగ్స్ రహిత సమాజం కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న పోరాటం గొప్పదని" అని ఆయన అన్నారు. సిద్ధార్ధ్ మాట్లాడుతూ..మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. డ్రగ్స్ కు నో చెప్పండి అన్నారు.అలాగే నా పూర్తి మద్దతు తెలంగాణ ప్రభుత్వానికి ఉంటుందని తెలిపారు.

ALSO READ | Siddharth: నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు..సీఎం రేవంత్‍ రెడ్డికి పూర్తిగా మద్దతిస్తున్నా: క్లారిటీ ఇచ్చిన సిద్ధార్థ్

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ తెరకెక్కించిన భారతీయుడు ఎంత సంచలనం సృష్టిందో ప్రతి ప్రతి భారతీయుడికి తెలిసిందే.  ఇపుడు ఆయన 28 ఏళ్ళ తర్వాత భారతీయుడు సీక్వెల్ ను తీసుకొస్తున్నాడు. ఈ సినిమాని లైకా ప్రొడ‌క్ష‌న్స్, రెడ్ జెయింట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బ‌డ్జెట్ ఠీ తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న రిలీజ్ కానుంది.