మన దేశంలో ధనవంతులు ఎవరు అంటే.. ఠక్కున అంబానీ, అదానీ అంటాం.. మరి మన దాయాది దేశం పాకిస్తాన్ లో ధనవంతుడు ఎవరు అంటే.. ఇలాంటి డౌట్ వస్తే దానికి సమాధానం కావాలి కదా.. పాకిస్తాన్ దేశంలోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ఉన్నారు. అతని గురించి వివరంగా తెలుసుకుందామా...
వందల కోట్ల సంపదతో ఈ 74 ఏళ్ల పారిశ్రామికవేత్త పాకిస్తాన్‌లోనే అత్యంత ధనవంతుడు. వ్యాపార ప్రపంచంలో ప్రముఖ పేరున్న షాహిద్ రఫీక్ షాద్ ఖాన్, ఫ్లెక్స్-ఎన్-గేట్ అనే ఒక స్పెర్ పార్ట్స్ సప్లయర్ కంపెనీకి అధినేత. ప్రస్తుతం ఫ్లెక్స్-ఎన్-గేట్ చాల రకాల కార్ల కంపెనీలకు ప్రముఖ ఆటోమోటివ్ సప్లయర్.
షాహిద్ రఫీక్ ఖాన్ ఎవరు?
షాహిద్ రఫీక్ ఖాన్ పాకిస్తానీ-అమెరికన్ వ్యాపారవేత్త, 18 జూలై 1950న లాహోర్‌లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. సమాచారం ప్రకారం, అతని తండ్రి ఒక చిన్న దుకాణం నడిపేవారు, అతని తల్లి మాథ్స్ ప్రొఫెసర్. అతని సోదరుడు మరణించిన తర్వాత, 16 ఏళ్ల వయస్సులో కుటుంబ బాధ్యతలు తనపై వేసుకున్నాడు.
అతను 1980లో ఫ్లెక్స్-ఎన్-గేట్ కంపెనీని కొని.. దానికి యజమాని అయ్యాడు. వన్-పీస్ ట్రక్ బంపర్ కోసం అతని డిజైన్ అతన్ని ఉన్నత స్థాయికి చేర్చింది. ఈ కంపెనీకి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 76 ఉత్పత్తి ప్లాంట్లు, 27 వేల కంటే పైగా ఉద్యోగులు ఉన్నారు. షాహిద్ రఫీక్ ఖాన్ 2012లో NFL జాక్సన్‌విల్లే జాగ్వార్స్‌ను, 2013లో UK ఫుల్హామ్ ఫుట్‌బాల్ క్లబ్‌ను కొన్నాడు. ఫోర్బ్స్ ప్రకారం, అతను పాకిస్తాన్ నుండి వలస వచ్చి 1991లో అమెరికన్ పౌరుడు అయ్యాడు.
చదువు, పెళ్ళి, కుటుంబం
ఇల్లినాయిస్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు షాహిద్ రఫీక్ ఖాన్ ఆన్ కార్ల్సన్‌ను తొలిసారి కలిసాడు, తరువాత 1977లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. యునైటెడ్ స్టేట్స్‌లో చదువుతున్నప్పుడు ఖర్చుల కోసం అతను డిష్‌వాషర్‌గా కూడా పనిచేశాడు. తరువాత, షాహిద్ రఫీక్ ఖాన్ గ్రెంగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఇంజనీరింగ్ చేసాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు... కూతురు షన్నా ఖాన్, కొడుకు టోనీ ఖాన్. షాహిద్ రఫీక్ ఖాన్ కొడుకు టోనీ ఖాన్, WWE తర్వాత ఉత్తర అమెరికాలో రెండవ అతిపెద్ద రెజ్లింగ్ ప్రమోషన్ అయిన ఆల్-ఎలైట్ రెజ్లింగ్ (AEW) యజమాని, CEO అండ్ బుకర్.
అతని ఆస్తుల మొత్తం విలువ ఫోర్బ్స్ ప్రకారం, 1/6/26 నాటికి USD $14.7 బిలియన్లు అంటే 13 వేల కోట్ల కంటే పైమాటే... పాకిస్థాన్‌లో పుట్టి, అమెరికాలో స్థిరపడిన షాహిద్ రఫీక్ 'షాద్' ఖాన్, ప్రస్తుతం పాకిస్థానీ సంతతికి చెందిన అత్యంత ధనవంతుడు. కేవలం 50వేలతో అమెరికా వెళ్లిన ఆయన నేడు కోట్ల సామ్రాజ్యాన్ని శాసిస్తున్నారు.ఫోర్బ్స్ మ్యాగజైన్ షాహిద్ ఖాన్‌ను "ది ఫేస్ ఆఫ్ అమెరికన్ డ్రీమ్" గా అభివర్ణించింది. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్లేకుండా కష్టపడి పైకి వచ్చిన ఆయన జీవితం ఎందరికో ఆదర్శం.
