భూమి పెరగడానికి ఇదేమన్నా కేసీఆర్ ముక్కా

భూమి పెరగడానికి ఇదేమన్నా కేసీఆర్ ముక్కా

మంత్రి మల్లారెడ్డి భూ కబ్జాపై తీవ్రంగా స్పందించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. హైదరాబాద్ గాంధీ భవన్ లో మాట్లాడిన ఆయన.. ఓ రియల్టర్ చేసిన లే ఔట్ లో తన మామూళ్ళు ఇవ్వాలని మంత్రి మల్లారెడ్డి మాట్లాడినట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీ ఫామ్ అమ్మకాల బాగోతం కూడా బయటికొచ్చిందన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతి ఆరోపణలపై చర్యలు తీసుకోవడం లో ఎవరైన ఒక్కటే అన్న సీఎం..కొడుకైన, కూతురినైనా జైలుకు పంపిస్తా అని కూడా అన్నారని చెప్పుకొచ్చిన రేవంత్..ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి .. భూ కబ్జాలపై ఆధారాలను బయటపెడ్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

1965-66 నుండి 2001-02 వరకు గుండ్ల పోచంపల్లి లో సర్వే 650లో 22 ఎకరాల 8 గుంటలు వుందని..ధరణి వచ్చాక 2021 లో అదే భూమి 33 ఎకరాల 26 గుంటలు అయ్యిందన్నారు. భూమి పెరగడానికి ఇదేమన్నా కేసీఆర్ ముక్కా అని ప్రశ్నించారు. మల్లారెడ్డి బామ్మర్ది శ్రీనివాస్ రెడ్డి పేరుతో 16ఎకరాల భూమి ధరణిలో నమోదైందని.. అది కూడా ఎలా వచ్చిందో కూడా తెలీదన్నారు. ఆ భూమి మల్లారెడ్డి ట్రస్ట్ కు గిఫ్ట్ డీడ్ అయ్యిందన్నారు.2004లో దేవర యంజాల్ లో జిపి లే అవుట్ పేరుతో అమ్మారని.. అదే భూమిని 2015 లో HMDA పర్మిషన్ పేరుతో మరోసారి అమ్మినట్లు తెలిపారు. జవహర్ నగర్ లో సర్వే నెంబర్ 408 లో 5ఎకరాల భూమి సర్కార్ భూమి వుంది. దాన్ని అధికారులు కూడా సర్కార్ భూమి అని బోర్డు పెట్టారని...కానీ ఆ భూమి శాలిని రెడ్డి పేరుపై డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయ్యిందన్నారు. అదే భూమిలో మల్లారెడ్డి CMR ఆస్పత్రి నిర్మించి.. వైద్య వ్యాపారం చేస్తున్నాడని తెలిపారు.