రాష్ట్రానికి విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూప్ !.. భారీ పెట్టుబడికి ముందుకొచ్చిన దిగ్గజ కంపెనీ

 రాష్ట్రానికి  విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూప్ !..  భారీ పెట్టుబడికి  ముందుకొచ్చిన దిగ్గజ కంపెనీ
  • సీఎం రేవంత్​ను కలిసిన ఆ కంపెనీ ఆసియా సీఈఓ ఫామ్ సాన్ చౌ
  • ఈవీ తయారీ యూనిట్లు, బ్యాటరీ నిల్వ సౌకర్యాలు ఏర్పాటుకు ఇంట్రెస్ట్ 
  • తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు ఆహ్వానించిన సీఎం

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో దిగ్గజ కంపెనీ విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూప్ ముందుకొచ్చింది. శుక్రవారం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎంను విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూప్ ఆసియా సీఈఓ ఫామ్ సాన్ చౌ మర్యాదపూర్వకంగా కలిశారు. తుగ్లక్ రోడ్ లోని సీఎం అధికారిక నివాసంలో జరిగిన ఈ భేటీలో తెలంగాణలో కీలక ప్రాజెక్టులను స్థాపించడానికి ఫామ్ సాన్ చౌ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) తయారీ యూనిట్లు, బ్యాటరీ నిల్వ సౌకర్యాలను ఏర్పాటు చేయాలనే ఆసక్తిని సీఎంకు వివరించారు. హైదరాబాద్ సమీపంలో ప్రభుత్వ ప్రతిపాదిత భారత్ ఫ్యూచర్ సిటీపై విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రూప్ ఆసియా సీఈఓ ఫామ్ సాన్ చౌ ప్రత్యేక ఆసక్తి చూపించారు. 

ఫ్యూచర్ సిటీ ఏర్పాటుపై సీఎం చొరవను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా డిసెంబర్ 8–9 తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో పాల్గొనాలని  ఫామ్ సాన్ చౌతో పాటు విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రూప్ చైర్మన్ ఫామ్ నాట్ వూంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్ రెడ్డి, సెక్రటరీ కోఆర్డినేషన్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.