సమక్క సారక్క దీవెనలతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడింది : సీఎం రేవంత్ రెడ్డి

 సమక్క సారక్క దీవెనలతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడింది : సీఎం రేవంత్ రెడ్డి

సమ్మక్క సారక్కలంటేనే పోరాట స్పూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అమరులై దేవతలుగా వెలిసారని చెప్పారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవతలను కోరుకున్నానని తెలిపారు. ముఖ్యమైన ఏ కార్యక్రమం తీసుకున్న ఇక్కడి నుంచే మొదలు పెట్టామని చెప్పారు. హాత్ సే హాత్ జోడో యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభించామని అన్నారు. 

సమక్క సారక్క దీవెనలతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. యాత్ర సమయంలో ఎలాంటి ఆకంటం లేకుండా జాతర జర్పిస్తామని మాట ఇచ్చామని  మాట ప్రకారం జాతర కోసం  రూ. 110 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశామని తెలిపారు. జాతరకు వచ్చేందుకు  6 వేల బస్సులతో రవాణా సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. 18 కోట్ల ఉచిత ఆర్టీసీ టికెట్లు వాడారని చెప్పారు   

 ఎన్నో వడిదుడుకులు ఎదురుకుని నిలబడ్డామని అందుకే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని చెప్పారు. ప్రజా పాలన ప్రజలకు చేరువైతుందని నమ్మకం కల్పించామని తెలిపారు. జాతరకు కోటిన్నరకు పైగా  భక్తులు వస్తే ఈ పండుగను  జాతీయ పండుగగా మార్చమని కేంద్రాన్ని కోరామని కానీ అందుకు కేంద్రం స్పందించలేదని చెప్పారు. త్వరలోనే కేసీఆర్ అవినీతి పై విచారణ జరిపిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.