డెలివరీకి టైముందని ఆస్పత్రి నుంచి వెనక్కి పంపితే.. 

డెలివరీకి టైముందని ఆస్పత్రి నుంచి వెనక్కి పంపితే.. 

రాజన్నసిరిసిల్ల జిల్లా ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. వీర్నపల్లి మండలానికి చెందిన మాధవి అనే మహిళకు పురిటినొప్పులు రావడంతో .. నిన్న ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు బంధువులు. అయితే డెలివరీ టైం ఇంకా 20 రోజులు ఉందంటూ డాక్టర్లు వెనక్కి పంపారని ఆరోపిస్తున్నారు. రాత్రి మళ్లీ నొప్పులు రావడంతో ఇవాళ ఉదయం ఆస్పత్రికి తీసుకొచ్చారు బంధువులు.  నొప్పులు తట్టుకోలేక హాస్పిటల్ లో బాత్రూమ్ కు వెళ్లిన మాధవికి అక్కడే డెలివరీ అయ్యింది. అయితే పుట్టిన పసిపాప మృతి చెందింది. దీంతో మాధవి, ఆమె కుటుంబ సభ్యులు కంటతడిపెట్టుకుని విలపించారు.  ప్రభుత్వాస్పత్రి చుట్టూ రెండు రోజులు తిరిగినా ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు బాధితురాలి బంధువులు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే పాప చనిపోయిందని ఆవేదన వ్యక్తం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఘటనపై స్పందించిన ఆస్పత్రి సూపరింటెడెంట్ 
సిరిసిల్ల ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఘటనపై   హాస్పిటల్ సూపరింటెండెంట్ మురళీధర్ రావు స్పందించారు. ఫిర్యాదు అందిన వెంటనే విచారణ చేపట్టామని..  పుట్టిన చిన్నారి మృతి విషయంలో హాస్పిటల్ డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యమేమి లేదని తేలిందని చెప్పారు. మాధవి బాత్ రూమ్ కి వెళ్లి డెలివరీ అయిందన్నారు. బిడ్డ పుట్టడమే ప్రాణం లేకుండా జన్మించినట్లు గుర్తించామన్నారు. మాధవి గర్భం దాల్చిన తర్వాత  రెగ్యులర్ గా ప్రైవేటు హాస్పిటల్ లో చూపించుకుంటోందని, డెలివరీకి ఇక్కడకు వచ్చినట్లు సూపరింటెండెంట్ మురళీధర్ రావు వివరించారు. 

 

 

ఇవి కూడా చదవండి

మా' తెలంగాణగా నామకరణం చెయ్యాలి

ప్రజల వెసులుబాటు కోసమే కొత్త కోర్టులు

పల్లెప్రగతి సమావేశాన్ని బహిష్కరించిన సర్పంచులు