ప్రజల వెసులుబాటు కోసమే కొత్త కోర్టులు

ప్రజల వెసులుబాటు కోసమే కొత్త కోర్టులు

ప్రజల వెసులుబాటు కోసమే కొత్త కోర్టులు అందుబాటులోకి వచ్చాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జిల్లా కోర్టులు ఏర్పాటు కావాలని చీఫ్ జస్టిస్ ను అడగగానే ఒప్పుకున్నారని, జిల్లా కోర్టుల్లో అన్ని పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో రెవెన్యూ జిల్లాలకు అనుగుణంగా ఏర్పాటైన 33 కొత్త జిల్లా కోర్టుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో పాటు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం ... 33 జిల్లా కోర్టులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఎన్వీ రమణ గతంలో ఇదే హైకోర్టులో పని చేసినట్లు చెప్పారు. హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని కోరిన వెంటనే మంజూరు చేశారని చెప్పారు. హైదరాబాద్ పాత జిల్లా మినహాయిస్తే మిగిలిన అన్ని జిల్లాలో కొత్త కోర్టులు వస్తున్నట్లు వెల్లడించారు. 

ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని జిల్లా కోర్టులు ఏర్పాటు చేయడం జరిగిందని, పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా సత్ఫాలితాలు వస్తాయనే కేసీఆర్ అభిప్రాయపడ్డారు. గతంలో సెషన్స్ కోర్టుకు వెళ్లాలంటే కిలో మీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. ప్రజలకు వెసులుబాటు కోసమే కొత్త కోర్టులు అందుబాటులోకి వచ్చాయని స్పష్టం చేశారాయన. సిటీ సివిల్ కోర్టు, రంగారెడ్డి కోర్టులు విభజించాలని, సిటీ సివిల్ కోర్టు, రంగారెడ్డి కోర్టులలో వర్క్ లోడ్ తగ్గేలా త్వరలో చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. జ్యుడీషియల్ డిపార్ట్ మెంట్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. 
 

మరిన్ని వార్తల కోసం : -

తెలంగాణ కోసం పోరాడి హోంగార్డు ఉద్యోగం కోల్పోయాడు



లైవ్ అప్ డేట్స్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు